స్పోర్ట్స్ బ్రాలో సమంత అరాచకం: అలాంటి భంగిమలతో అందాల విందు

సాధారణంగా టాలీవుడ్‌లో ఉన్న పోటీ కారణంగా సుదీర్ఘ కాలం పాటు స్టార్లుగా హవాను చూపించడం సాధ్యం కాదు. అలాంటిది దాదాపు పదేళ్లకు పైగానే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది సమంత రూత్ ప్రభు. 'ఏమాయ చేశావే' అంటూ వచ్చి.. తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ఈ భామ.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకుంది. తద్వారా ఇప్పటికీ వరుసగా సినిమాలను చేస్తూ సత్తా చాటుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తోన్న సమంత.. తాజాగా సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌ షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూడండి!

టాలీవుడ్ స్టార్.. ఇప్పుడు ఇలా

టాలీవుడ్ స్టార్.. ఇప్పుడు ఇలా


చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయిన సమంత.. ఏమాత్రం బ్రేక్ లేకుండా వరుసగా ప్రాజెక్టులు చేస్తోంది. అయితే, కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన ఈ సుందరాంగి.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ మూవీలు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ అలరిస్తోంది.

నేషనల్ క్రేజ్... భారీ ప్రాజెక్ట్స్

నేషనల్ క్రేజ్... భారీ ప్రాజెక్ట్స్


కొంత కాలంగా దక్షిణాది భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. గత ఏడాది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర బాగా హైలైట్ అవడంతో నేషనల్ రేంజ్‌ ఎదిగింది. ఫలితంగా సమంతకు బాలీవుడ్‌ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

యశోదగా హిట్.. ఆ మూవీతో

యశోదగా హిట్.. ఆ మూవీతో

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 'యశోద' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే, ఆమె గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' మూవీని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఖుషితో పాటు వెబ్ సిరీస్‌లో

ఖుషితో పాటు వెబ్ సిరీస్‌లో

ప్రస్తుతం సమంత రూత్ ప్రభు.. విజయ్ దేవరకొండతో 'ఖుషి' అనే మూవీలోనూ చేస్తోంది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ఓ సినిమాతో పాటు BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో వెబ్ ఫిల్మ్ కూడా చేయనుంది. అంతేకాదు, ప్రస్తుతం ఈ చిన్నది 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. దీనికి సంబంధించిన షూట్‌లోనే ఇప్పుడు ఆమె పాల్గొంటోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న సమంత.. మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. అయినప్పటికీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

ఆరోగ్య సమస్య.. వర్కౌట్లతో

ఆరోగ్య సమస్య.. వర్కౌట్లతో

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. దీని నుంచి కోలుకునేందుకు చాలా రోజుల పాటు చికిత్సను తీసుకున్న ఈ అమ్మడు.. వర్కౌట్లను కూడా బాగా పెంచేసింది. ఇందులో భాగంగానే కొంత కాలంగా జిమ్‌లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఫిట్‌గా మారే ప్రయత్నం చేస్తోంది. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతోన్నాయి.

సామ్ వర్కౌట్ పిక్స్ వైరల్‌

సామ్ వర్కౌట్ పిక్స్ వైరల్‌

సమంత రూత్ ప్రభు తాజాగా కొన్ని వర్కౌట్ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. వీటిలో ఆమె స్పోర్ట్స్ బ్రా, బుల్లి షార్ట్‌తో వర్కౌట్లు చేస్తూ కనిపించింది. అంతేకాదు, ఘాటు భంగిమలతో కుర్రకారును రెచ్చగొట్టేలా దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X