Samantha: శుభవార్త చెప్పిన సమంత.. కొత్త అధ్యాయం ప్రారంభమంటూ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన వార్తల్లో నిలుస్తారు. ఆరోగ్య సమస్యతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సమంత తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఆమె మళ్లీ ఫుల్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. సినిమాలు, ప్రొడక్షన్, బిజినెస్ ఇలా అన్ని విషయాల్లో తన దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్తల్లో నిలిచింది.తాజా కొత్త అధ్యాయం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ సంగతేంటీ? మీ కూడా ఓ లూక్కేయండి.
సమంత.. రీఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్‌లో కూడా బిజీగా మారింది. సమంత బిజీగా మారింది. ఓ వైపు నటన, మరోవైపు ప్రొడక్షన్స్ బాధ్యతలు చేపడుతుంది. తాజాగా తన స్వంత ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Moving Pictures) ద్వారా "మా ఇంటి బంగారం" అనే సినిమాను నిర్మిస్తోంది. ఇందులో సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదెలా ఉంటే.. ఆమె త్వరలోనే "రక్త బ్రహ్మాండ" అనే వెబ్ సిరీస్‌లో నటించనుంది.

ఇక మరోవైపు సమంత పర్సనల్ లైఫ్ కు సంబంధించిన రూమర్స్ తో కూడా వార్తల్లో నిలుస్తోంది. గత కొంత కాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో ఆమె సన్నిహిత సంబంధం గురించి సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. వీరిద్దరూ కలిసి పార్టీలకు, సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం ఆ వార్తలకు మరింత బలం చేసుకుంటుంది. ఇటీవల ఓ ఈవెంట్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గామారింది. దీంతో డేటింగ్ రూమర్స్ కు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. అయితే.. అయితే సమంత ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదెలా ఉంటే.. తాజాగా సమంత తన కొత్త క్లాతింగ్ బ్రాండ్ " ట్రూలీ.స్మా (Truly. Sma)"ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేస్తూ.. 'న్యూ చాప్టర్ బిగిన్స్' అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. తన నూతన ఫ్యాషన్ లైన్‌ను పరిచయం చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తన అభిమానులు, సెలబ్రిటీలు, ఫ్యాషన్ లవర్స్ అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే, సమంత ఇప్పటికే "సాకీ" (Saaki) పేరుతో ఓ క్లాతింగ్ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతోంది. దానికి తోడు ఇటీవలే పర్ఫ్యూమ్ బిజినెస్ కూడా ప్రారంభించింది. ఇప్పుడు "Truly. Sma" అనే కొత్త లైన్‌తో ఆమె ఫ్యాషన్ రంగంలో మరింత బలంగా అడుగుపెడుతోంది. ఈ బ్రాండ్ కంఫర్ట్, సింప్లిసిటీ, సైలెంట్ కాన్ఫిడెన్స్ అనే థీమ్‌లపై దృష్టి పెట్టనుందని తెలుస్తోంది.
మొత్తం మీద, సినిమాలు, ప్రొడక్షన్, ఫ్యాషన్, బిజినెస్ ఇలా పలు రంగాల్లో సమంత తన సత్తా చాటుతోంది. "Truly. Sma" ప్రారంభం ద్వారా ఆమె మరోసారి "సమంత స్టైల్ అండ్ స్ట్రెంగ్త్" ను నిరూపించింది. అభిమానులు అయితే "సామ్ ఇప్పుడు నటిగా మాత్రమే కాకుండా, ఒక సక్సెస్‌ఫుల్ బ్రాండ్‌గా మారింది" అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











