హాట్ షోకు అసలైన అర్థం చెప్పిన సమంత: ఎద అందాలు బయటపెట్టేసి మరీ!

దాదాపు పదిహేనేళ్లుగా తనదైన అందం, అభినయంతో రాణిస్తూ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతోన్న ఈ చిన్నది.. వరుసగా సినిమాలు, సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే ఓ అరుదైన వ్యాధి బారిన పడినా.. ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ సమంత తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

 పంథాను మార్చేసిన సమంత

పంథాను మార్చేసిన సమంత


'ఏమాయ చేశావే' సినిమాతో వచ్చిన సమంత తెలుగు ప్రేక్షకులను మాయ చేసేసింది. అప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో తనదైన గ్లామర్ పాత్రలను చేసి స్టార్‌గా ఎదిగిపోయింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె పంథాను మార్చుకుని పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఒప్పుకుంటోంది. ఇలా ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకుని ఫుల్ స్పీడుతో దూసుకెళ్తోంది.

 నేషనల్ క్రేజ్.. మరో సిరీస్‌లో

నేషనల్ క్రేజ్.. మరో సిరీస్‌లో


తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేసి హవాను చూపించిన సమంత.. ఆ మధ్య 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్లో నటించి.. బాలీవుడ్‌లోకి పరిచయం అయింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్రతో నేషనల్ రేంజ్‌ క్రేజ్‌ను అందుకుంది. దీంతో ఇప్పుడు మళ్లీ అదే కాంబోలో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవలే ఈ షూట్ పూర్తి చేసింది.

యశోదతో హిట్.. ఇప్పుడిలా

యశోదతో హిట్.. ఇప్పుడిలా


స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది 'యశోద' అనే చిత్రంతో వచ్చింది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. ఇటీవలే సామ్.. గుణశేఖర్‌ తెరకెక్కించిన 'శాకుంతలం' మూవీని పూర్తి చేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేస్తున్నారు. దీంతో ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

సమంత చేతిలోని మూవీలు

సమంత చేతిలోని మూవీలు


ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి సమంత రూత్ ప్రభు 'ఖుషి' అనే మూవీలోనూ చేస్తోంది. అలాగే, ఇళయదళపతి విజయ్‌తోనూ ఓ సినిమాను చేస్తుంది. వీటితో పాటు BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో ఓ ఇంగ్లీష్ ఫిల్మ్ చేయబోతుంది. ఇవి మాత్రమే కాదు.. ఈ చిన్నది సౌత్ నుంచి నార్త్ వరకూ ఎన్నో ప్రాజెక్టుల్లో భాగం అవుతూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

అక్కడ మాత్రం యాక్టివ్‌గానే

అక్కడ మాత్రం యాక్టివ్‌గానే


హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తోన్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా ఎంతో కాలంగా తనదైన రీతిలో నెటిజన్లను అలరిస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

హెల్త్ బాలేకున్నా హాట్ షోనే

హెల్త్ బాలేకున్నా హాట్ షోనే


ఇటీవలే సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. దీని నుంచి కోలుకునేందుకు చాలా రోజుల పాటు చికిత్సను తీసుకున్న ఈ అమ్మడు.. కెరీర్‌కు కూడా కాస్త గ్యాప్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ మేకప్ వేసుకుంటోన్న సామ్.. కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో హాట్ షోతో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ పిక్స్ షేర్ చేస్తోంది.

చీరలోనూ సెగలు రేపుతోంది

చీరలోనూ సెగలు రేపుతోంది


ఈ మధ్య సోషల్ మీడయాలో యమ రెచ్చిపోతోన్న సమంత రూత్ ప్రభు.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ట్రాన్స్‌పరెంట్ శారీలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా సామ్ ఎద అందాలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవి వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X