Divorce: డైవోర్స్ దెబ్బకు కోట్లు నష్టపోయిన సమంత.. సామ్ కోసం ముగ్గురు డాక్టర్లు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరిగా తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే అంతకుముందు సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడి ఏడాది పాటు సినిమాలకు దూరంగా సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య తో డివోర్స్ తర్వాత చాలా ఆఫర్లను సమంత తిరస్కరించాల్సి వచ్చింది. ఏదేమైనా మళ్లీ ఖుషి చిత్రంతో ఫిలిమ్స్ పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్లో రూపుదిద్దుకున్న యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్ లో నటించి అదరగొట్టింది. యాక్షన్ సీన్లలో తన సత్తా చాటి మరోసారి సెన్సేషన్ గా మారారు సమంత.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ కేసులో, బెట్టింగ్ యాప్ స్కాములు, ఐటీ రైట్స్ అంటూ కొంతకాలంగా చిత్ర పరిశ్రమలు ఆందోళనకరమైన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా 20 కి పైగా సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ స్కాం లో భాగంగా కేసులు నమోదు చేశారు. విచారణ కూడా జరిపించారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి పేద కుటుంబాలు ఆర్థిక ఊబిలో కూరుకు పోయేలా చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Samantha Ruth Prabhu lost crores after her divorce

ఇక ఈ సందర్భంగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కీలక ప్రకటన చేసింది. రీసెంట్గా తను ఫుడ్ ఫార్మర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వాక్యాలు చేసింది. సమంత ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చింది. తను తీసుకునే నిర్ణయాలు కూడా ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలని భావిస్తున్నట్టుగా చెప్పింది. తను నా అభిమానించేవారు, ప్రజలు కూడా తను ప్రమోట్ చేసే పలు రకాల బ్రాండ్స్ ద్వారా మోసపోయా అవకాశం ఇవ్వబోననీ చెప్పుకొచ్చింది. పలు రకాల బ్రాండ్స్ ను ప్రమోట్ చేసే విషయంలో తాను ఎంతో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉంటానని సమంత స్వయంగా ప్రకటించింది.

ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండడం కోసం గత ఏడాది 15 బ్రాండ్స్ లకు సంబంధించిన ఆమోదాలను తిరస్కరించినట్లు చెప్పుకొచ్చింది. మనం సక్సెస్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు తమ బ్రాండ్లను ఎండోర్స్మెంట్ చేసేందుకు వస్తుంటారని చెప్పింది. ఇక తన ఎర్లీ స్టేజ్ లోనే అలాంటి అవకాశాలు చూసానని చెప్పింది. చాలా కంపెనీలు తనను తమ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసింది. కానీ ప్రజల పట్ల బాధ్యత యుతంగా ఉండడం కోసం కోట్లాది విలువచేసే బ్రాండ్లను కూడా ఆమోదం తెలుపకుండా తిరస్కరించాలని చెప్పింది.

ప్రస్తుతం తను ఏ బ్రాండ్ ని ఎండార్స్మెంట్ చేసిన తన దగ్గర ఉన్న ముగ్గురు కీలకమైన డాక్టర్ల ద్వారా పరిశీలన చేసిన తర్వాతనే ఆమోదం తెలుపుతున్నట్టు చెప్పుకొచ్చింది. ప్రజల భద్రతే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చింది. అయితే సమంత అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత అటు మూవీ ఆఫర్స్, ఇటు చాలా కంపెనీల నుంచి బ్రాండ్ ఎండార్స్మెంట్ ఒప్పందాల కోసం ఆఫర్లు వచ్చాయి. కానీ ఓవైపు డివోర్స్, మరొకవైపు మయోసైటిస్ దెబ్బకు సమంత కోట్లల్లో నష్టపోయిందని అంటున్నారు. ఇక నెక్స్ట్ సమంత రక్త్ భ్రమరాండ సిరీస్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X