నిన్ను తలచుకొన్నప్పుడల్లా అలాంటి ఫీలింగ్.. సమంత మరోసారి ఎమోషనల్
తెలుగులో ఎంట్రీ ఇచ్చి కొంతకాలానికి చాలా మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ సమంత. ఆ తర్వాత తెలుగువాడైన అక్కినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్యను ప్రేమించి వివాహమాడిన ఆమె తెలుగింటి కోడలిగా తెలుగువారికి మరింత దగ్గరయింది. ఎవరూ ఊహించని విధంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఆ తర్వాత చేస్తున్న అన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె చేస్తున్న ప్రతి వ్యాఖ్య, పోస్ట్ చేస్తున్న ప్రతి ఫోటో కూడా వెంటనే వైరల్ అవుతోంది. తాజాగా కాశ్మీర్లో ఉన్న ఆమె కాశ్మీర్ గురించి పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

విడాకుల అనంతరం
సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఏం మాయ చేసావే అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తరువాత అనేక విజయవంతమైన సినిమాల్లో భాగమైంది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి, ఆమె పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకుంది. తెలుగులో క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య - సమంత విడిపోతున్నారంటూ 2021 వ సంవత్సరంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

వెంటనే వైరల్
దానికి ఊతమిస్తూ వారు కూడా తాము విడాకులు తీసుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. వారి విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అది వెంటనే వైరల్ అవుతోంది. ఆమె కూడా సోషల్ మీడియాలో అర్థం అయ్యీ అవకుండా తన బాధను వ్యక్తం చేస్తూ అనేక రకాలైన కొటేషన్లు కూడా షేర్ చేస్తూ చర్చనీయాంశం అవుతోంది. ఎప్పటికప్పుడు అర్థంకాని కొటేషన్లు షేర్ చేస్తూ ఉండే ఆమె తాజాగా మాత్రం కాశ్మీర్ అందాలను అభివర్ణిస్తూ కాశ్మీర్ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది.

కాశ్మీర్ లో షూట్
అసలు విషయం ఏంటంటే సమంత, విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే సమంత పుట్టినరోజు వేడుకలను కూడా సినిమా యూనిట్ ఘనంగా నిర్వహించింది. అయితే ఎట్టకేలకు ఆమె కాశ్మీరు విడిచి హైదరాబాద్ వచ్చేయాల్సిన సమయం ఏర్పడింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్లు ఇప్పటికే ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అభిమానులతో పంచుకుంటూ
మళ్లీ కాశ్మీర్ లో షూటింగ్ ఉంటుందో లేదో తెలియదు కానీ, కాశ్మీర్ తో తనకున్న అనుబంధాన్ని సమంత పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. కాశ్మీర్ వెళ్ళినప్పటి నుంచి అక్కడి ప్రకృతి అందాలను, అక్కడి జీవన విధానాలను కెమెరాలో బంధించి వాటిని అభిమానులతో షేర్ చేసుకుంటూ సమంత ఆసక్తి రేకెత్తించింది.

ప్రశాంతతతో
కాశ్మీర్‌ను ఎప్పుడు తలచుకున్నా కూడా తన హృదయంలో ప్రశాంతతతో కూడిన చిరునవ్వు విరబూస్తుందని చెప్పుకొచ్చింది. కాశ్మీర్ మీద ఎంతో ప్రేమతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కాకుండా సమంత చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నాయి ఆమె బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది


Click it and Unblock the Notifications











