తల్లిని కావాలనుకుంటున్నా..అలాంటి వ్యక్తి దొరికితే, సమంత షాకింగ్ పోస్ట్
అక్కినేని నాగచైతన్య - శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వీరి పెళ్లికి తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. చైతూ ఓ ఇంటివాడు కావడంతో అక్కినేని అభిమానులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సమంత వార్తల్లో నిలుస్తున్నారు. చైతూకి వివాహం కావడంతో ఆమె కూడా రెండో పెళ్లి చేసుకుంటారా? లేక ఇలాగే ఒంటరిగా ఉంటారా అంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఈ నేపథ్యలో సమంత తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒంటరిగానే ఉంటున్నారు. తన సినిమాలు, వెబ్ సిరీస్‌లు వాటి ప్రమోషన్స్‌తో గడిపేస్తున్నారు. రీసెంట్‌గానే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్: హనీ బన్నీతో దుమ్ము రేపిన సమంత మరికొన్ని క్రేజీ వెబ్ సిరీస్‌లకు ఓకే చెప్పినట్లుగా చిత్ర పరిశ్రమలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తుంబాడ్ ఫేమ్ అనిల్ బార్వే దర్శకత్వంలో రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్ డమ్ లో ఆమె నటించనున్నారు. శోభితను నాగచైతన్య పెళ్లాడబోతున్నట్లుగా తెలిసినా సామ్ ఏమాత్రం పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు.

ఇలాంటి దశలో సమంతకు ఊహించని షాక్ తగిలింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇక నేను మిమ్మల్ని కలవలేను డాడీ అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని సామ్ జత చేశారు. సమంత ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. చదువుకుంటూనే పనిచేసి ఆర్ధిక సమస్యలను అధిగమించారు. నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతానని సమంత చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ముఖ్యంగా ప్రతి విషయంలో తండ్రి తనకు అండగా నిలిచారని సమంత పలుమార్లు తెలిపారు.
నిజానికి సామ్ - చైతూ విడిపోయినప్పుడు జోసెఫ్ ఎంతో బాధపడ్డారు. విడాకుల తర్వాత సమంత కృంగిపోకుండా ఆమెకు ధైర్యం చెప్పి అండగా నిలిచారు. ఈ దశలో తండ్రి హఠాన్మరణం సమంతను మరింత కృంగదీసింది. సమంతను సన్నిహితులు, ఇతర సినీ ప్రముఖులు ఓదార్చినప్పటికీ ఆమె మాజీ భర్త నాగచైతన్య, అక్కినేని ఫ్యామిలీ నుంచి కనీస ఓదార్పు లభించలేదు.
ఇప్పడు శోభిత - నాగచైతన్యలకు పెళ్లి అయిపోయింది. మరి సమంత కూడా పెళ్లి చేసుకుని తిరిగి వైవాహిక జీవితంలో అడుగుపెడతుందా అన్న ప్రశ్నలు అన్ని వైపులా వినిపిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం తీరిగ్గా కుక్కలతో ఆడుకుంటోంది. అంతేకాకుండా నాషా (సమంత పెట్ డాగ్) ప్రేమలాంటి మరో ప్రేమ ఈ ప్రపంచంలో లేదన్నట్లుగా మొన్నామధ్య ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. శోభిత తమ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన కొద్దిసేపటికే సమంత ఈ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది.

అయితే కొత్త ఏడాది సమంత గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. 2025 కొత్త సంవత్సరంలో తనకేం కావాలో చెబుతూ ఓ విష్ లిస్ట్‌ను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన రాశికి 2025లో ఎలా ఉంటుందని చెబుతూ .. తనకు కొత్త సంవత్సరంలో ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నూతన సంవత్సరం మీకు అంతా మంచి జరగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











