Samantha Net Worth: హీరోలకు ధీటుగా సమంత సంపాదన.. రాజ్‌‌తో పెళ్లి తర్వాత ఆస్తులు ఎన్ని కోట్లంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా వెలుగొందుతున్నారు సమంత రూత్ ప్రభు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సామ్.. తన కష్టం, ప్రతిభతో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైనా తన కష్టంతో తిరిగి నిలదొక్కుకున్నారు. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా తన స్థానం మాత్రం చెక్కుచెదరలేదని నిరూపించారు. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు.. ఈ ఏడాది ఆమె బర్త్ డే ఎంతో ప్రత్యేకం. రాజ్‌ నిడిమోరుతో రెండో పెళ్లి తర్వాత ఆమె తొలి పుట్టినరోజు. ఈ సందర్భంగా సమంత జీవిత ప్రయాణం, ఆమె ఆస్తులు, ఇతర వ్యక్తిగత వివరాలు పరిశీలిస్తే..

28 ఏప్రిల్ 1987న చెన్నైలో జన్మించారు సమంత. ఆమె అసలు పేరు సమంత రూత్ ప్రభు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగువారు కాగా.. తల్లి నైనిట్టే మలయాళీ. చెన్నైలోని పల్లవరంలో ఆమె బాల్యం గడిచింది. నగరంలోనే చదువుకున్న సమంత.. చదువుకుంటూనే మోడలింగ్ చేసింది. ఈ క్రమంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఏం మాయ చేశావే (2010)తో వెండితెరపై అడుగుపెట్టారు. అయితే ఈ సినిమా కంటే ముందు తమిళంలో నటించిన విన్నైతాండి వరువాయ సినిమా రిలీజైంది. ఏం మాయ చేశావే చిత్రం ఘన విజయం సాధించడంతో తెలుగులో సమంతకు ఆఫర్లు క్యూకట్టాయి.

Samantha Ruth Prabhu Net Worth Here is her Career Assets Remuneration amp amp Interesting Details

బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, అత్తారింటికి దారేది, మనం, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, రాజుగారి గది 2, రంగస్థలం, మహానటి, ఓ బేబీ తదితర చిత్రాలతో తిరుగులేని నటిగా ఎదిగారు. హీరోయిన్‌గా స్టార్‌డమ్‌తో పాటు దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలలోనూ సమంత నటించారు. కెరీర్‌లో నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, రెండు ఐఫా ఉత్సవం అవార్డులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు సమంత. ఇవి కాకుండా పలు సంస్థల నుంచి పురస్కారాలు ఆమెను వరించాయి.

ఏమాయ చేశావే సినిమా సమయంలో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత కొన్నాళ్లు డేటింగ్ చేశారు. అనంతరం ఇద్దరూ పెద్దల అంగీకారంతో 2017లో గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగగా.. ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పరస్పర అంగీకారంతో 2021లో నాగచైతన్య - సమంతలు విడాకులు తీసుకున్నారు. మయోసైటిస్ అనే వ్యాధి బారినపడిన సమంత దాని నుంచి కోలుకున్నారు. హిందీలో ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సిరీస్‌లు తెరకెక్కించిన రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడిన సమంత ఆయనను 2025 డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నారు.

సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఇతర మార్గాల ద్వారా సమంత భారీగా సంపదను కూడబెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. సినిమాకు 7 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయలకు పైగా సమంత రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాగే పలు టాప్ బ్రాండ్లకు సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి కోట్లలో పారితోషికం అందుకున్నారు. తన సంపాదనను రియల్ ఎస్టేట్, క్లాత్, జ్యువెలరీ తదితర రంగాల్లో ఆమె పెట్టుబడులు పెట్టారు. గతేడాది ఓ పికెల్ బాల్ జట్టును కొనుగోలు చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను సమంత నిర్మిస్తున్నారు. సాకీ, ట్రూలీ స్మా పేరుతో ఫ్యాషన్ బ్రాండ్స్‌ను నడుపుతున్నారు సామ్.

హైదరాబాద్, చెన్నై, ముంబైలలో పలు లగ్జరీ అపార్ట్‌మెంట్లు సమంతకు ఉన్నాయి. అలాగే ఆమె గ్యారేజ్‌లో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. బీఎండబ్ల్యూ 7 సిరీస్, జాగ్వార్ ఎక్స్ఎఫ్, ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జీ63, ఏఎంజీ కార్లు ఉన్నాయి. మొత్తంగా సమంత ఆస్తుల విలువ 120 కోట్ల రూపాయల పైమాటేనని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలతో పాటు తనను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో పలు స్వచ్ఛంద సంస్థలకు భారీగా విరాళాలు అందించింది. ఆమె జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.

Read more about: samantha movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X