నన్ను తక్కువ అంచనా వేయొద్దు.. అక్కడ ఒక్క కిక్ ఇస్తా.. సమంత పోస్ట్ వైరల్

అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల సైలెంట్‌గా నిశ్చితార్ధం చేసుకుని ఇండస్ట్రీకి, అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే . త్వరలోనే వీరి పెళ్లి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోని ఏదో ఒక చోట విలాసవంతమైన ప్యాలెస్‌లో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డెస్టినేషన్‌ని సెట్ చేసే పనిలో ఇరు కుటుంబాలు ఉన్నాయి. నాగచైతన్య - శోభితల ఎంగేజ్‌మెంట్ తర్వాత స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా సామ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.. ఆ డిటెయిల్స్‌లోకి వెళితే

నాగచైతన్య .. మరో తోడు వెతుక్కుని రేపో మాపో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. మరి సమంత పరిస్ధితేంటీ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చైతన్యతో విడాకులయ్యాక సమంత ఆ బాధ నుంచి బయటపడటానికి చాలాకాలమే పట్టింది. మధ్యలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడిన ఆమె చికిత్స తీసుకుని కోలుకున్నారు . స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం సిటాడెల్ : హనీబన్నీలో సామ్ నటిస్తున్నారు.

Samantha Ruth Prabhu new Instagram post viral on her health here s the details

అయితే సమంత కూడా ఆల్రెడీ ఒకరితో ప్రేమలో పడ్డారని , త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా పుకార్లు చక్కర్లు కొట్టాయి. ది ఫ్యామిలీ మెన్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్ నిడుమోరి‌తో సామ్ డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ముంబైలో జరిగిన వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో భాగంగా చెన్నై ఫ్రాంఛైజీని కొనుగోలు చేశారు సమంత. టోర్నీ ముగిసిన తర్వాత ఛాంపియన్స్‌తో కలిసి సరదాగా పికిల్ బాల్ ఆడారు సామ్.

మహిళల హక్కులు, బాధ్యతల గురించి గట్టిగా మాట్లాడే సమంత.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కుదిపేస్తోన్న జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌పైనా స్పందించారు. మలయాళంలో మాదిరిగానే ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఒక కమిటీ ఉండాలని ఆమె కోరారు. ముఖ్యంగా టాలీవుడ్‌లోనూ ఓ కమీషన్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సమంత కోరారు.

ఇక నాగచైతన్య - శోభితల ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటి నుంచి సమంత ఏ పోస్ట్ పెట్టినా ఇంటర్నెట్‌ షేక్ అవుతోంది. ప్రేమ ఒక త్యాగం.. కొన్నిసార్లు ప్రేమనే పంచినా ఇతరులు తిరిగివ్వరు, నువ్వు ఇస్తేనే నేను ఇస్తా అనేలా పరిస్థితి మారిపోతుందని ఆమె పెట్టిన పోస్ట్ కొద్దిరోజుల క్రితం వైరల్ అయ్యింది. తాజాగా సామ్ ఇన్‌స్టా పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

గత నెలలో ముంబైలో ఓ పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించిన వీడియో వైరల్ కావడంతో సామ్ అభిమానులు టెన్షన్ పడ్డారు. ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయారని, బాగా వెయిట్ లాస్ అయ్యిందని కామెంట్స్ చేశారు. ఇది సమంత దృష్టికి రావడంతో డంబెల్స్ పట్టుకుని జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అలాగే తానేమీ స్లిమ్‌గా లేనని, మీ పిర్రలపై ఒక్కటిస్తానంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X