Samantha: నా లైఫ్‌లో ఆ తప్పులు చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్

Samantha: టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఏడాది కాలం అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ప్రస్తుతం ఓరియంటెడ్ కంటెంట్ తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా'సిటాడెల్‌: హనీ బన్నీ' (Citadel: Honey Bunny) సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ తాను గతంలో కొన్ని తప్పులు చేశానని, షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఇంతకీ సమంత చేసిన తప్పలు ఏంటీ? ఆమె ఏ విషయంలో బాధపడుతోంది? మీరు కూడా ఓ లూక్కేయండి.

స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా లీడ్ రోల్ నటించిన స్పై యాక్షన్‌ సిరీస్‌ 'సిటాడెల్‌: హనీ బన్నీ'(Citadel: Honey Bunny). ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్ హీరోగా న‌టిస్తుండ‌గా, 'ది ఫ్యామిలీ మ్యాన్‌', 'ఫర్జీ' లాంటి విజయవంతమైన సిరీస్‌లను తెరకెక్కిన రాజ్‌ అండ్‌ డీకే ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా న‌టించిన‌ హాలీవుడ్ బ్లాక్ బ‌స్టర్ వెబ్ సిరీస్ 'సిటాడెల్‌'కు ఈ సిరీస్ రీమేక్‌గా రాబోతుందట. ఇందులో కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్, కష్వీ మజ్ముందర్ త‌దిత‌రులు న‌టించారు. ఈ సిరీస్ అమెజాన్‌ ప్రైమ్‌ లో నవంబర్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Samantha Ruth Prabhu opened up about her last few films in an Ask Me Anything session on Instagram

సిటాడెల్‌: హనీ బన్నీసీరిస్ రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ మూవీ టీం వ‌రుస ప్రమోష‌న్స్ చేస్తూ బిజీబిజీ అయ్యారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ సమంత తన ఇన్‌స్టా వేదికగా ఆస్క్‌ మీ ఎనీ థింగ్‌ సెషన్‌ నిర్వహించింది. అభిమానులతో సరదాగా కాసేపు ముచ్చటించింది. తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలిచ్చింది. ఈ తరుణంలో ఓ అభిమాని మాట్లాడుతూ.. "సిటాడెల్ కోసం మీరు ఎంత కష్టపడ్డారో ? మీ పాత్ర ఎలా ఉంటుందో ? మాకు చెప్పగలరా?" అని ఓ అభిమాని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు సమంత బదులిస్తూ.. 'నేను నటించే ప్రతి పాత్రను సవాలుగా తీసుకుంటా.. అందుకే నాకు నేను ఓ ప్రామిస్ చేసుకుంటాను. ప్రతి పాత్ర కూడా గతంలో చేసిన దాని కంటే చాలా విభిన్నంగా, చాలా కష్టంగా ఉండాలని కోరుకుంటాను. అయితే.. గతంలో నేను సినిమాల్లో కొన్ని తప్పులు చేసాను. నిజంగా కొన్ని సినిమాల్లో కష్టపడి పని చేయలేదని భావిస్తున్నా. నేను నా వైఫల్యాన్ని అంగీకరిస్తున్నాను. గతం కొన్ని చిత్రాలలో నా వంతు కృషి నేను చేయలేకపోవచ్చని అంగీకరిస్తున్నాను." అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

అలాగే.. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. గతంలో కొన్ని తప్పులు చేశానని వెల్లడించింది. సిటాడెల్ అనేది ప్రాజెక్ట్‌లో నటించినందుకు నిజంగా గర్వపడుతున్నాననీ, ఇందులో తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన, కాంప్లికేటెడ్, ఛాలెంజింగ్ రోల్ లో నటించానని తెలిపారు. సమంతా చివరిగా కాతువాకుల రెండు కాదల్ సినిమా, యశోద, శాకుంతలం, కుషి సినిమాల్లో నటించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన కాతువాకుల రెండు కాదల్ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కూడా నటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹ 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X