Samantha: నా జీవితంలో దానికి చోటు లేదు.. చైతూ సెకండ్ మ్యారేజ్ పై సామ్ రియాక్షన్
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అనతికాలంలోనే అగ్ర హీరోల సరసన లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది. తన అందం, అభినయంలో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. వరుస విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే.. ఈ అమ్మడు తన కెరీర్ లో ఎంత సక్సెస్ పుల్ గా కొనసాగుతున్న పర్సనల్ లైఫ్ లో మాత్రం కోల్కోలేని దెబ్బతిన్నది. హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, ఆ పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా మారింది. తాజాగా హీరోయిన్ సమంత తన మాజీ భర్త నాగ చైతన్య, శోభితాల పెళ్లిపై తొలిసారి స్పందించింది.
'ఏమాయ చేశావే' సినిమాతో సమంత తెలుగు సినిమాల్లో అడుగుపెట్టింది. మొదటి మూవీతో సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో దర్శక, నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టారు. ఇలా వరుసగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్రహీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అతితక్కువ కాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు అందుకుంది.

ఈ తరుణంలో అక్కినేని నట వారసుడు, హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఈ జంట పెద్దలను ఒప్పించి, ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా వారి మూడు మూళ్ల వివాహ బంధం మూడ్నాళ్లు ముచ్చటగా మారింది. ఇద్దరి మధ్య కలహాలు చోటు చేసుకోవడంతో వారు తమ వివాహ బంధాన్ని తెచ్చుకున్నారు. ఈ పరిణామం కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత సింగిల్ గా తన లైఫ్ను లీడ్ చేస్తుంది. ఆ తరువాత 'మయోసైటీస్' అనే అదురైన వ్యాధి బారినపడింది.
దాదాపు ఏడాది కాలంపాటు సినిమాలకు దూరంగా ఉంది. అప్పటి నుంచి టాలీవుడ్ గా దూరంగా ఉంటూ.. బాలీవుడ్ లో వరుస సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇక గతేడాది నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల ను రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ కపుల్ వివాహం డిసెంబర్ 4న హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్లిపై సమంత ఎప్పుడు కూడా డైరెక్ట్ గా స్పందించలేదు. తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్య శోభిత దూళిపాళ్ల వివాహంపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. మీ మాజీ భర్త రెండో వివాహం చేసుకోవడం మీకు అసూయ కలిగించిందా? అంటూ యాంకర్ ప్రశ్నించగా.. సామ్ దిమ్మతిరిగిపోయి సమాధానం ఇచ్చింది. సమంత మాట్లాడుతూ.. నా జీవితంలో అసూయకు తావులేదు. నా జీవితంలో అసూయ భాగం కావడానికి నేను అంగీకరించను. అసూయనే చెడుకు మూలమని నేను భావిస్తాను. కాబట్టి నాకు వారిపై ఎలాంటి అసూయ లేదు. వాస్తవానికి అలాంటి విషయాలను నేను పట్టించుకోను. వాటి గురించి ఎక్కువగా ఆలోచించను' అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత మెచ్యూరిటీ ఆన్సర్ ఇచ్చిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆమె ఫ్యాన్స్.
మరోవైపు సమంత .. గత కొంతకాలంగా 'సిటాడెల్: హానీ బన్నీ' వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నాగ చైతన్య తండేల్ చిత్రంతో ఆడియన్స్‌ని పలకరించబోతున్నారు. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తోంది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











