Don't Miss!
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Lifestyle
మీ జుట్టు ఒత్తుగా లేదా మెరుస్తూ ఉండాలనుకుంటున్నారా? వీటిని ఉపయోగించండి...
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
Samantha: శృతి మించిన సమంత హాట్ షో.. ఆమెను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!
యాక్టింగ్‌లో అదరగొడుతూ.. గ్లామర్ ట్రీట్‌లో ఏమాత్రం తగ్గకుండా.. సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్న నటీమణుల్లో సమంత రూత్ ప్రభు పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి. అంతలా ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. ఇక, కెరీర్ ఆరంభంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈమె.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక, ఇటీవలి కాలంలో అయితే ఈమె మరింతగా రచ్చ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా సమంత సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్కులపై మీరూ లుక్కేయండి మరి!

అప్పుడు గ్లామర్.. ఇప్పుడు ఇలా
'ఏమాయ చేశావే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సమంత.. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఆరంభంలో ఈ బ్యూటీ ఎక్కువగా గ్లామరస్ రోల్స్ మాత్రమే చేసింది. అయితే, ఇప్పుడు మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటోంది. ఇలా ఉత్తమ నటనను చూపిస్తూ దూసుకుపోతోంది.
Neil Kitchlu: కొడుకు ఫొటోతో కాజల్ బిగ్ సర్‌ప్రైజ్.. నీల్ కిచ్లూ ఎలా ఉన్నాడో చూశారంటే!

అప్పటి నుంచి నేషనల్ రేంజ్
తెలుగు, తమిళంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చిన సమంత.. రెండు భాషల్లోనూ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అమెజాన్ రూపొందించిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ వరల్డ్‌లోకి వెళ్లింది. ఇందులో ఆమె చేసిన పాత్ర బాగా హైలైట్ అయింది. దీంతో సమంత క్రేజ్ నేషనల్ రేంజ్‌కు పెరిగిపోయింది.

వరుస మూవీలు... అవి కంప్లీట్
విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంలో సమంత నటించిన విషయం తెలిసిందే. నయనతార, విజయ్ సేతుపతి కూడా నటించిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. అలాగే, గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూట్ పూర్తైంది. సామ్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.
బాత్రూంలో శ్రీయ హాట్ సెల్ఫీ: వామ్మో తల్లైనా అస్సలు తగ్గకుండా అందాల ఆరబోత

అతడితో కలిసి కశ్మీర్‌లో సామ్
వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న సమంత త్వరలోనే ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఓ ఇంగ్లీష్ వెబ్ ఫిల్మ్‌లో నటించబోతుంది. ఇది 'The arrangements of love' నవల ఆధారంగా రూపొందనుంది. దీనితో పాటు 'యశోద' అనే పాన్ ఇండియా సినిమానూ చేస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండతోనూ ఓ మూవీ చేస్తోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే
కెరీర్ పరంగా ఎంతో స్పీడుగా దూసుకుపోతోన్నప్పటికీ సమంత సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటూ మరింతగా ఫేమస్ అవుతోంది. అందుకే ఆమెను టాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.
మరోసారి యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటుగా!

అందాలను ఆరబోస్తోన్న నటి
సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న సమంత.. అప్పుడప్పుడు అందాల విందు కూడా చేస్తూ తన ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. ఇందులో భాగంగానే కొంత కాలంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఇలా సమంత తన ట్రీట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ముందుకు సాగుతోంది.

అరాచకమైన ఫొటోలు వదిలి
క్రమంగా తన బ్రాండ్ వ్యాల్యూను కూడా పెంచుకుంటోన్న సమంత.. తాజాగా 'పీకాక్' అనే మ్యాగజైన్ కోసం కొన్ని కవర్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇందులో రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని దిగిన పిక్‌లో ఈ అమ్మడు శృతి మించి మరీ అందాలు మొత్తం ఆరబోసింది. దీంతో ఈ ఫొటోకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.