పెళ్లి అమ్మాయి ఇష్ట ప్రకారమే జరగాలి.. కాళ్లు పట్టి లాగేస్తారు జాగ్రత్త.. సమంత మనసులో మాట అలా!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎదురించి ప్రొఫెషనల్ జీవితంలో దూసుకెళ్తున్నది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీలో ఓ మార్కును క్రియేట్ చేసుకొంటున్నది. ఓ వైపు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్న వాటిని తట్టుకొని సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, వ్యాపార ప్రకటనల్లో జోష్ చూపిస్తున్నది. తాజాగా సమంత నటించిన పెప్సీ యాడ్ వైరల్ అయింది. ఆ యాడ్ గురించి.. అలాగే వ్యక్తిగత జీవిత వివరాల్లోకి వెళితే..

విజయాలు.. వైఫల్యాలతో సమంత: సమంత జీవితం, ఫ్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే.. అంతా సవ్యంగా సాగుతున్నట్టు కనిపించడం లేదు. విజయాలు, వైఫల్యాలు, సుఖ:సంతోషాలు, గెలుపు ఓటములు ఆమె జీవితంతో పోటీపడుతున్నట్టు కనిపిస్తున్నది. నాగచైతన్యతో దాంపత్య జీవితం విచ్ఛినమైన తర్వాత సమంత చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటూ పోతున్నది.

Samantha Ruth Prabhus Pepsi Advertisement trending on Social media

యశోద మూవీతో హిట్.. అలా ఫ్లాప్: సమంత అరుదైన వ్యాధితో బాధపడుతూనే సినిమాలు చేసుకొంటూ పోతున్నారు. యశోద సినిమాతో భారీ విజయాన్ని అందుకొంటే.. శాకుంతలం సినిమాతో డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకొన్నారు. ఇక ఆమె నటించిన ఖుషీ సినిమా, సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టులను పైప్ లైన్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Samantha Ruth Prabhus Pepsi Advertisement trending on Social media

పెప్సీ యాడ్‌లో సమంత: ఇక సమంత కెరీర్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. వ్యాపార ప్రకటనల్లో కూడా విస్తృతంగా కనిపిస్తున్నారు. తాజాగా సమంత రుతు ప్రభు పెప్సీ కంపెనీ యాడ్‌లో అద్బుతంగా నటించి ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం ఈ యాడ్ వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. pepsiriseupbabyXsamantha అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.

Samantha Ruth Prabhus Pepsi Advertisement trending on Social media

అమ్మాయి ఇష్టప్రకారమే పెళ్లి: సమంత నటించిన పెప్సీ యాడ్ వివరాల్లోకి వెళితే.. అమ్మాయిలతో ప్రపంచానికి చాలా కష్టాలు. అమ్మాయిల పెళ్లి టైమ్ ప్రకారం జరగాలి అంటే.. అమ్మాయి పెళ్లి టైమ్ ప్రకారం కాదు. అమ్మాయి ఇష్ట ప్రకారం జరగాలి అని సమంత సమాధానం ఇచ్చింది.

అర్ధరాత్రి 12 గంటలకు ఏ పని ఖతం అవుతుందంటే.. 12 గంటలకు కూడా ఖతం కాదు అంటూ సమాధానం ఇస్తుంది. యాక్షన్ అంటే హీరోలే చేయాలి కదా అని ఓ వ్యక్తి అంటే.. దేవదూతల హీరో మేమే అంటూ సమంత ఫ్లయింగ్ కిక్ ఇచ్చింది.

Samantha Ruth Prabhus Pepsi Advertisement trending on Social media

ప్రపంచం నిన్ను లాగేయాలని ప్రయత్నిస్తుంది: ఇంకా పెప్సీ యాడ్‌లో సమంత మాట్లాడుతూ.. అందరి మాటలు వింటే.. నీవు చేయాల్సింది ఎప్పుడు చేస్తావు అంటూ సమంత సందేశాన్ని ఈ యాడ్ ద్వారా ఇచ్చింది. ఎప్పుడు ప్రపంచం నిన్ను వెనుకకు లాగాలనే చూస్తుంది. కాబట్టి నీ అంతట నీవే ఎత్తుకు ఎదగాలి అంటూ పెప్సీ యాడ్‌లో సమంత దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం సమంత యాడ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X