Shaakuntalam పెద్దమ్మగుడిలో సమంత పూజలు.. శాకుంతలం రిలీజ్ ఎప్పుడంటే?
యశోద సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన శాకుంతలం సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాగా ఏప్రిల్ 14వ తేదీన రాబోతున్నది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ప్రారంభించడానికి ముందు సమంత రుత్ ప్రభు, దేవ్, నిర్మాత నీలిమా గుణ, దర్శకుడు గుణశేఖర్ మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడిని సందర్శించారు. పెద్దమ తల్లి ఆశీర్వాదం, దీవెనలు తీసుకొన్న తర్వాత ప్రమోషన్స్ కొనసాగించేందుకు సిద్దమయ్యారు. పెద్దమ్మ గుడిలో పూజలు అనంతరం సమంత రుత్ ప్రభు మాట్లాడుతూ...

అమ్మవారి దీవెనలు తీసుకొన్న తర్వాత శాకుంతలం ప్రమోషన్స్ ప్రారంభించాలని అనుకొన్నాం. అందుకే ఆలయానికి వచ్చి పూజలు చేశాం. శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్నది. నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ ఫిలిం. నా హృదయానికి చేరువైన సినిమా. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా చేయాలని ప్లాన్ చేశాం. ఈ సినిమాను మీరు బాగా సపోర్ట్ చేయాలని కోరుకొంటున్నాను. మీ దీవెనలు, ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాను అని సమంత అన్నారు.
శాకుంతలం సినిమాను ఇటీవల ప్రైవేట్ ప్రీమియర్‌గా సమంత చూసింది. ఈ సినిమా చూసిన ఆమె చాలా సంతోషంతోను, కాన్ఫిడెన్స్‌గా కనిపించింది. నా మనసుకు దగ్గరైన సినిమా అంటూ ఆ సందర్భంగా చెప్పింది. ఈ సినిమాను దిల్ రాజు, గుణశేఖర్, నీలిమా గుణతో కలిసి చూసింది.

అయితే శాకుంతలం సినిమా లుక్స్, టీజర్లు ఇప్పటికే అంచనాలు పెంచాయి. ఈ సినిమా పలు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతున్నది.
శాకుంతలం టీమ్ వివరాలు
నటీనటులు: సమంత రుత్ ప్రభు, దేవ్ మోహన్, సచిన్ కేడ్కర్, అదితి బాలన్, ప్రకాశ్ రాజ్, గౌతమి, కబీర్ బేడి, జిషు సేన్ గుప్తా, కబీర్ సింగ్, వర్షిణి సౌందర్య రాజన్, హరీష్ ఉత్తమన్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణశేఖర్
సినిమాటోగ్రఫి: శేఖర్ వీ జోసెఫ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
మ్యూజిక్: మణిశర్మ
బ్యానర్: గుణ టీమ్ వర్క్స్
డిస్ట్రిబ్యూషన్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-04-14


Click it and Unblock the Notifications











