రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్?.. మరోసారి బాయ్‌ఫ్రెండ్‌తో అలా..

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగానే జీవిస్తున్నారు సమంత. తన సినిమాలు తాను తీసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. కానీ కాలం, చుట్టూ ఉన్న జనం ఊరుకోరు కాదా? సమంత ఎప్పుడు దొరకుతుందా అని ఎదురు చూస్తుంటారు. చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో తను కూడా మరో పెళ్లి చేసుకోబోతోందని మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. రాజ్ నిడిమోరు ఎంట్రీతో అది పీక్స్‌కి చేరింది. తాజాగా సామ్ పోస్ట్ చేసిన ఫోటోలు మరోసారి వైరల్ అయ్యాయి.

సమంతకు భారీ ఫ్లాప్స్‌

చైతన్యతో విడాకుల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమను చాలా వరకు పక్కనపెట్టేశారు. అయితే అప్పటికే శాకుంతలం, ఖుషి వంటి సినిమాలకు కమిట్ కావడంతో వాటిని వేగంగా పూర్తి చేశారు సమంత. శాకుంతలం సినిమా సమయంలోనే తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు బయటపెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైన సామ్ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. దురదృష్టవశాత్తూ ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం, ఖుషి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

Samantha Ruth Prabhu playing pickleball With Rumoured Boyfriend Raj Nidimoru Photos goes viral

వెబ్ సిరీస్‌లతో సమంత హవా

ఆ సమయంలో ఓటీటీలలో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్న సామ్.. ఫ్యామిలీమెన్‌తో హిట్ కొట్టారు. ఏకంగా యాక్షన్ సీక్వెన్స్‌లతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఈ వెబ్ సిరీస్ ఘన విజయం సాధించడంతో పాటు సమంతకు అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సిటాడెల్ హనీ బన్నీతో మరోసారి యాక్షన్‌లోకి దిగారు. ఇది కూడా టాప్ ట్రెండింగ్‌లో కొనసాగింది. ఓటీటీలలో వరుస విజయాల నేపథ్యంలో సమంత ఇక సినిమాల జోలికి వస్తారా? రారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే సినిమాలు చేసినా, చేయకున్నా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఓ సంస్థ చేసిన సర్వేలో దేశంలో నెంబర్ వన్ హీరోయిన్‌గా బాలీవుడ్ ముద్ధుగుమ్మలను, లేడీ సూపర్‌స్టార్లను సైతం వెనక్కి నెట్టి నెంబర్‌వన్‌గా నిలిచారు సామ్.

సమంత రెండో పెళ్లిపై గాసిప్స్

ఎప్పుడైతే శోభిత ధూళిపాళ మెడలో నాగచైతన్య మూడు ముళ్లు వేశారా? అప్పటి నుంచి సమంత రెండో పెళ్లి ఎప్పుడు? పెళ్లి కొడుకు ఎవరు? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మెన్, సిటాడిల్ వెబ్ సిరీస్‌లు తీసిన రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. దీనికి కారణం లేకపోలేదు.. సామ్ ఎక్కడికెళ్లినా అక్కడ రాజ్ ప్రత్యక్షమవుతున్నారు. అలాగే పలు ఈవెంట్స్‌కు కూడా వీరి కలిసి హాజరవుతున్నారట. రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లి కాగా..భార్యకు త్వరలోనే విడాకులిచ్చి సమంత మెడలో మూడు ముళ్లు వేస్తారని గాసిప్స్ వచ్చాయి. మీడియాలో వస్తున్న ఈ కథనాలపై రాజ్, రాజ్ భార్య, సమంత విడివిడిగా ఖండిస్తూ ప్రకటనలిచ్చారు.

రాజ్‌తో క్లోజ్‌గా సమంత

కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం సమంత - రాజ్‌ల బంధంపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుడిని సమంత దర్శించుకున్నారు. ఆ సమయంలో రాజ్ నిడిమోరు పక్కనే ఉండటం చర్చనీయాంశమైంది. తాజాగా సమంత నిర్మాతగా మారి నిర్మించి శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆమె వెంటే రాజ్ నిడిమోరు కనిపిస్తున్నారు. థియేటర్‌లో కలిసి సినిమా చూడటంతో పాటు విమానంలో రాజ్ భుజాలపై సమంత వాలిపోయి చాలా క్లోజ్‌గా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా హ్యాపీ వీకెండ్ పేరుతో సమంత కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇందులో సామ్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోలతో పాటు రాజ్‌తో కలిసి పికెల్ బాల్ ఆడుతున్న వీడియోలు ఉన్నాయి. దీంతో సమంత- రాజ్ నిడిమోరు బంధంపై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X