Samantha Ruth Prabhu: ఆ హీరోతో కలిసి పబ్ లో ఎంజాయ్ చేసిన సమంత.. ఊ అంటావా అంటూ..
గ్లామరస్ హీరోయిన్ సమంత కేవలం ఒక లాంగ్వేజ్ లో కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తోంది. అది కూడా రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ తో ఎట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తోంది. ఇక ప్రస్తుతం అటు బాలీవుడ్ లో కూడా బిజీ అయిన సమంత అప్పుడప్పుడు కొన్ని పార్టీలలో పాల్గొంటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇక లేటెస్ట్ గా ఆమెకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. అందులో అమ్మడు పుష్ప ఐటెమ్ సాంగ్ కు స్టెప్పులు కూడా వేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
విజయ్ తో ఖుషి మూవీ: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఖుషి మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశలో ఉంది. పాన్ ఇండియా మూవీ గానే దీనిని ఆవిష్కరిస్తున్నారు. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత ముస్లిం అమ్మాయిగా కనిపిస్తోంది.

ఆ హీరోతో పబ్ లో సమంత: దీంతోపాటు సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సీరియస్ లో వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటిస్తోంది. రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ షూటింగ్ సైబీరియాలో చేస్తున్నారు. ఈ సందర్భంగా సమంత, వరుణ్ ధావన్ స్థానికంగా ఉన్న ఓ పబ్ కి వెళ్లారు.

ఊ అంటావా అనే సాంగ్ కు స్టెప్పులు: అక్కడ పుష్ప సినిమాలోని ఊ అంటావా అనే సాంగ్ కి వరుణ్ ధావన్ తో కలిపి ఆమె స్టెప్పులు వేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత పాపులారిటీ, అలాగే పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో రీచ్ అయిందనేది ఈ వీడియోతో స్పష్టమవుతుంది.

బిజీబిజీగా సమంత: సిటాడల్ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించింది. అదే వెబ్ సిరీస్ ని ఇప్పుడు సమంత వరుణ్ ధావన్ ఇండియన్ వెర్షన్ లో చేస్తున్నారు. ఈ సిరీస్ తో తన పాపులారిటీ మరింత పెరుగుతుందని సమంత భావిస్తోంది. మరోవైపు చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ మూవీకి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి ఆమె ఆడిషన్ కూడా ఇచ్చిందట. ఈ మూవీ ఈ ఏడాది ఆఖరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
మరికొన్ని సినిమాలు: చెన్నై స్టోరీ రిలీజ్ అయితే సమంత ఇమేజ్ హాలీవుడ్ లెవల్ కి వెళ్లి పోవడం ఖాయం అని జోరుగా ప్రచారం అవుతోంది. వీటితోపాటు హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కుతున్న మూవీలో సమంత గోస్ట్ రోల్ లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఈ చిత్రం బాలీవుడ్ లో సమంత డెబ్యూ మూవీగా ఉండబోతోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. మరి సమంత ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











