బక్క చిక్కిపోతున్న సమంత.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రీసెంట్ గానే 'శుభం' అనే చిత్రాన్ని నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఇక నెక్ట్స్ తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సందడి చేస్తున్న ఈ బ్యూటీ అక్కడే క్రేజీ ప్రాజెక్ట్స్ లను ఓకే చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో ఆయా మూవీ ఈవెంట్లు, సినీ కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తోంది. కాగా తాజాగా సమంత తాజా లుక్ వైరల్ గా మారింది. ఆమె మరీ బక్కచిక్కిపోవడంతో సామ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దానిపై తాజాగా సామ్ స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఫిట్ నెస్ పై సామ్ ఫోకస్..
సమంత రూత్ ప్రభు ఫిట్ నెస్ విషయంలో చాలా క్రమ శిక్షణగా ఉంటుంది. హెల్త్ విషయంలో సామ్ ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలూ తీసుకుంటూనే ఉంటుంది. ఇక తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా జిమ్ లో మాత్రం సమయం గడుతుపుతుంది. మొత్తానికి జీరో ఫ్యాట్ బాడీని మెయిన్ టెయిన్ చేస్తూ ఫిట్ గా ఉంటుంది. అయితే ఇటీవల మాత్రం సమంత మరీ సన్నగా మారిపోయారు. మరింతగా వర్క్ అవుట్స్ చేస్తూ శరీరాన్ని నాజుగ్గా తయారు చేసింది. కానీ సమంత లేటెస్ట్ లుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మరీ సన్నగా మారిన సామ్..
శ్రీలీలాతో కలిసి GQIndia Power list 2025 ఈవెంట్ కు హాజరైంది. ఈ సందర్బంగా శ్రీలీలా, సమంత రూత్ ప్రభు కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇద్దరు కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అందులో శ్రీలీలా కంటే సామ్ మరింత సన్నగా కనిపించింది. దీంతో సామ్ ఇంత సన్నగా ఎందుకు మారిపోయారని అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఏదైనా అనారోగ్య సమస్యను ఎదుర్కుంటుందా? అని సందేహిస్తున్నారు. కానీ ఈ వార్తలపై సామ్ తాజాగా అదిరిపోయే రిప్లై ఇచ్చింది.
సమంత రిప్లే ఇదే..
తను మరీ సన్నగా కనిపిస్తున్న ఫొటోలపై వస్తున్న వార్తలకు సమంత ఇలా సమాధానం ఇచ్చింది. తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో కొన్ని వీడియోలను పంచుకుంది. తను స్కిన్నీగా, సిక్కీగా కనిపిస్తున్నాను కానీ ఫిట్ గానే, ఆరోగ్యంగానే ఉన్నట్టు తన వీడియోల ద్వారా తెలిపింది. చాలా ఎనర్జీటిక్ గా పుల్ అప్స్ తీస్తూ సమంత కనిపించింది. ఆ వీడియోను చూపిస్తూ ఇకపై మీరు నన్ను స్కిన్నీ, సిక్కీ అని పిలవాల్సిన పనిలేదని చెప్పింది.
సమంత అప్ కమింగ్ ప్రాజెక్ట్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తెలుగులో చివరిగా ఖుషి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక హిందీలో సిటాడెల్ చిత్రంతో ఆకట్టుకుంది. ఇటీవల నిర్మాతగానూ మారి ట్రాలాలా అనే ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించి శుభం అనే చిత్రాన్ని కూడా రిలీజ్ చేసింది. మంచి ఫలితాన్ని అందుకుంది. మరోవైపు హిందీలో నెట్ ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మాండ్, తెలుగులో మా ఇంటి బంగారం అనే చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











