సమంత రెండో పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా? గ్రాండ్ గా ఏర్పాట్లు?

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సెకండ్ మ్యారేజ్ కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2017లో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు వీరి కాపురం చక్కగానే సాగింది. కానీ ఏమైందో ఏమే గానీ 2021లో ఒక్కసారిగా వీరిద్దరూ సెపరేషన్ ను ప్రకటించడంతో టాలీవుడ్ ఉలిక్కి పడింది. అసలు వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారనేది ఇప్పటికీ మిస్టరీగా ఉండింది. ఎవరూ స్పష్టమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. వారి నిర్ణయాలను మాత్రం గౌరవించాలని అభిమానులను, తెలుగు ప్రేక్షకులను కోరారు.

విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు ఎంతగానో బాధపడ్డారని ఆమె సన్నిహితులు తెలిపారు. అలాగే ఆమె ఆరోగ్యం కూడా చెడింది. మయోసైటిస్ అనే నరాల బలహీనత వ్యాధికి గురై కొన్నాళ్లపాటు చికిత్స పొందింది. దాని వల్ల ఏకంగా ఏడాది పాటు సినిమాకు బ్రేక్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్ని సందర్శించి తన ఆరోగ్యం బాగుపడాలని పూజలు చేసింది. ఇక ఎట్టకేళలకు సమంత రూత్ ప్రభు తిరిగి కోలుకుంది. దాంతో మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది.

Samantha Ruth Prabhu ready for Second Marriage with Bollywood Director Raj Nidimoru

అయితే, నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు టాలీవుడ్ కు కాస్తా దూరంగా ఉండటం ప్రారంభించింది. అప్పటికే బాలీవుడ్ లో 'ది ఫ్యామిలీ మెన్' సిరీస్ లో నటించి ఉండటంతో మళ్లీ అక్కడే వెళ్లింది. దర్శకుడు రాజ్ నిడిమోరు దర్శకత్వంలో 'సిటాడెల్' అనే అమెరికన్ సిరీస్ లో నటించింది. అయితే ఈ క్రమంలోనే వీరద్ధరి మధ్య రిలేషన్ షిప్ ఏర్పడిందని, సమంత నాగచైతన్యను మరిచిపోయి రాజ్ నిడిమోరును ప్రేమిస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి.

వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత పెట్టిన పోస్టే ఇందుకు కారణమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. రాజ్ నిడిమోరుతో కొంత కాలంగా సమంత రూత్ ప్రభు రిలేషన్ షిప్ లో ఉందని బాలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియా కోడై కూస్తోంది. కానీ అటు సమంత గానీ, ఇటు రాజ్ నిడిమోరుగానీ స్పందించలేదు. నాగచైతన్య - శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక సమంత - రాజ్ నిడిమోరు బాలీవుడ్ లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇటీవల పలు ఈవెంట్లకు కూడా హాజరవుతూ కనిపిస్తున్నారు. కాగా ఇక సమంత దర్శకుడు రాజ్ నిడియోరును రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.

రాజ్ నిడిమోరు తెలుగు వాడే కావడం విశేషం. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతికి చెందిన వాడే. అయితే ఆయనకు ఇప్పటికే పెళ్లైంది. భార్య ఉంది. ఆమె కారణంగానే వీరిద్దరి పెళ్లి వాయిదా పడుతుందని, ఇక త్వరలోనే వీటన్నింటిని పరిష్కరించుకోబోతున్నారని ప్రస్తుతం గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇక సమంత మరోసారి ప్రేమ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలూ అందే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక సమంత చివరిగా 'సిటాడెల్' చిత్రంలో నటించింది. యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి'తో అలరించింది. ఆ తర్వాత 'మా ఇంటి బంగారం'లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X