Pushpa 2: సుకుమార్ ఊహించని షాక్ ఇచ్చిన సమంత.. ఏం జరిగిందంటే?

బ్యూటిఫుల్ గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న సమంత రాబోయే రోజుల్లో మరిన్ని డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతోంది. తెలుగులో డిఫరెంట్ లవ్ స్టోరీ లు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా యాక్షన్ సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆమె ప్రస్తుతం వర్కౌట్స్ కూడా చేస్తోంది. అలాగే తన ఆరోగ్యం విషయంలో కూడా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనలో కూడా బిజీ అవుతుంది.

సమంత ప్రత్యేకంగా కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడు పూజలు కూడా చేయిస్తోంది. అయితే ఇటీవల పుష్ప సెకండ్ కోసం అని సమంతకు ఒక ఆఫర్ రాగా ఆమె సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. డైరెక్ట్ గా సుకుమార్ ఆమెను సంప్రదించగా ఏమాత్రం సందేహం లేకుండా సమంత రిజెక్ట్ చేసినట్లు సమాచారం. పుష్ప ఫస్ట్ పార్ట్ లో ఐటమ్ సాంగ్ ఏ స్థాయిలో క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉ అంటావా మావ అనే ఆ పాట దాదాపు అన్ని భాషల్లో క్లిక్ అయ్యింది. మ్యూజిక్ పరంగానే కాకుండా సమంత హాట్ డ్యాన్స్ ఒక రేంజ్ లో క్లిక్కయ్యింది.

Samantha ruth prabhu rejected Allu arjun pushpa 2 movie offer

ఇక మళ్లీ ఆ రేంజ్ లో సక్సెస్ కావాలి అంటే సమంత కంటే అతిపెద్ద హీరోయిన్ ను తీసుకు రావాల్సి ఉంటుంది. కానీ సమంత మళ్ళీ వస్తేనే బాగుంటుంది అని అందరూ డిసైడ్ అయ్యారట. కానీ సమంతను సంప్రదించగా ఆమె మాత్రం మరో ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధంగా లేను అని డైరెక్ట్ గా చెప్పేసినట్లుగా తెలుస్తోంది. మొదట నిర్మాతలు సంప్రదించగా ఆమె చేయనని చెప్పిందట. ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ కూడా ప్రత్యేకంగా మాట్లాడినప్పటికీ కూడా ఇప్పట్లో ఐటెం సాంగ్ చేసే ఆలోచన లేను అని కూడా ఆమె వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ కూడా ఆమె బాలీవుడ్ ప్రాజెక్టులపై పెడుతోంది. అక్కడ సక్సెస్ అందుకొని మరిన్ని పెద్ద ప్రాజెక్టులతో రావాలి అని కూడా ఆలోచిస్తుంది. మరి సమంత ఆ ప్రాజెక్టులతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X