Koratala Siva కు షాకిచ్చిన సమంత.. ఎన్టీఆర్ కోసం ఏ మాత్రం తగ్గకుండా!
స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతూ కెరీర్ పరంగా యమ జోష్‌లో ఉంది సమంత. నాగ చైతన్యతో విడాకుల తర్వాత తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టింది ఈ స్టార్ బ్యూటీ. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ దూసుకుపోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాకుండా తన రోల్‌కి ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటున్న ఆమె, రెమ్మ్యూనరేషన్ పరంగా మాత్రం తగ్గేదేలే అంటోందట. అలా ఎన్టీఆర్‌తో సినిమా చేసే ఛాన్స్ వదులుకుందని తెలుస్తోంది.

ఐటెం భామగా సూపర్ క్రేజ్
ఓ వైపు హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపుతోంది సమంత. రెమ్మ్యూనరేషన్ భారీ మొత్తంలో తీసుకుంటూ కెమెరా ముందు అందాల ఆరబోతకు సైతం వెనకాడటం లేదు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అల్లు అర్జున్‌తో ఉ అంటావా మావ ఉ ఊ అంటావా మావ అంటూ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది.

సమంత కోసం క్యూ
ప్రస్తుతం సమంత క్రేజ్ దృష్టిలో పెట్టుకొని పలు భాషల్లోని దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. డిఫరెంట్ కథలతో ఆమెను సంప్రదిస్తున్నారు. అయితే సినిమాలో తన రోల్‌తో పాటు పారితోషికం కూడా దృష్టిలో పెట్టుకొని సదరు కథలను ఓకే చేస్తోందట సామ్. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రయత్నం వృధా అయిందని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌తో భారీ సినిమా
ఆచార్య డిజాస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో భారీ సినిమా ప్లాన్ చేశారు కొరటాల శివ. NTR 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే హీరోయిన్ వేటలో భాగంగా సమంతను కలిశారట కొరటాల శివ.

ఛాన్స్ ఇవ్వని సమంత
ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్‌గా నటించమని కోరుతూ కథ వినిపించారట. అయితే తన రోల్ పరంగా ఓకే కానీ రెమ్మ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిందట సామ్. కొరటాల టీమ్ దగ్గరనుంచి 2.5 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినప్పటికీ సమంత ఒప్పుకోలేదనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కొరటాల టీం వెనక్కి తగ్గారని ఫిలిం నగర్ టాక్.

లైన్‌లో సాయి పల్లవి
కొరటాల మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందట. దీంతో ఫస్ట్ హీరోయిన్‌ని వెతుకుతూనే సెకండ్ హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. అదేవిధంగా సాయి పల్లవి- ఎన్టీఆర్ కాంబోలో ఓ డాన్స్ నెంబర్ కూడా ప్లాన్ చేసి కొరటాల శివ పక్కాగా ప్లాన్ చేశారని ఇన్‌సైడ్ టాక్.


Click it and Unblock the Notifications











