గత ఏడాది చైతన్యతో.. మరి ఈ ఏడాది సమంత న్యూ వేడుకలను ఎవరితో జరుపుకోబోతుందో తెలుసా..?
2021 ముగుస్తుండటంతో ఒక్కొక్కరుగా మన సెలబ్రిటీస్ రాష్ట్రం దాటేసి కొత్త ఏడాది స్వాగత సంబరాల కోసం బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మాల్దీవ్స్, గోవా లాంటి చోట్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోగా కొందరు అయితే ఇప్పటికే అక్కడికి చేరుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సమంత తన నూతన సంవత్సరాది వేడుకల విషయం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

న్యూ ఇయర్ వేడుక
ఎక్కడ చూసిన ప్రజలంతా 2022 న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయారు. కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి కూడా. ఇక మన సినీ ప్రముఖుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏడాది మాల్దీవ్స్, దుబాయ్, వెనిస్ లాంటి విదేశాలకు వెళ్లి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వాళ్లు కూడా ఓమిక్రాన్ కారణంగా గోవాలో జరుపుకుంటున్నారు. ఇప్పటికే సమంత గోవా చేరి న్యూ ఇయర్ వేడుకల్లో బిజీగా ఉంది.

సన్నిహితులతో గడపాలని
సమంతా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ న్యూఇయర్ రోజు తన సన్నిహితులతో గడపాలని ఎదురు చూస్తున్నానని తెలిపింది. ఆమె మాట్లాడుతూ, "ఏడాది పొడవునా నన్ను పదిలంగా, హ్యాపీగా ఉంచిన గొప్ప స్నేహితులు నాకు ఉన్నారు. కాబట్టి, నేను వారితో, నా కుక్కలతో మరియు ముఖ్యంగా, నా తల్లితో సమయం గడపాలని ఎదురు చూస్తున్నాను అలా చేయడం గొప్పగా ఉంటుందని నేను భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.

గత ఏడాది చై సామ్ కలిసి
నిజానికి గత ఏడాది న్యూ ఇయర్ వేడుకలను చై సామ్ కలిసి జరుపుకున్నారు. కొత్త ఏడాదికి ఇంకా రెండు రోజులు ఉండగానే ఈ ఇద్దరూ గోవా బయలుదేరి వెళ్లి న్యూ ఇయర్ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఏడాది గడిచే లోపే వీరిద్దరూ విడి పోవడం గమనార్హం. వీరు విడిపోవడం ఫ్యాన్స్ కు నచ్చలేదు కానీ అది వారిద్దరి వ్యక్తిగత విషయం కాబట్టి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

సినిమాల విషయానికి వస్తే
ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య నుంచి విడాకుల తర్వాత సమంత జోరు పెరిగింది. టాలీవుడ్ తో పాటు బాషా భేదం లేకుండా ఎక్కడ అవకాశం వచ్చినా వెనక్కు తగ్గకుండా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే శాకుంతలం అనే సినిమా పూర్తి చేయగా ఆమె ప్రస్తుతం యశోద అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తుండగా మలయాళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సమంత కెరీర్ లో తొలి సౌత్ పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

మొదటి హాలీవుడ్ చిత్రం
దర్శక ద్వయం హరి, హరీష్‌ల యశోద షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. అలాగే సమంత తన మొదటి హాలీవుడ్ చిత్రం అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ షూటింగ్ ని ఆగష్టు 2022లో ప్రారంభించనుంది. అది కాక ఆమె నూతన దర్శకుడు శాంతరూబన్‌తో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం కూడా చేస్తోంది.


Click it and Unblock the Notifications











