500 కోసం 8 గంటలు నిలబడ్డా... కంటతడి పెట్టిస్తోన్న సమంత జర్నీ

భారతీయ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా ఉండే పేరు సమంత రూత్ ప్రభు. తన అందం, నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సామ్.. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఒకప్పుడు ఆర్ధిక సమస్యలతో సతమతమైన ఆమె ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యారు. ఇదంతా రాత్రికి రాత్రి రాలేదు. దీని వెనుక ఎంతో కష్టం, అవమానాలు, చీత్కారాలు ఉన్నాయి. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు వారిని పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. దూకుడు, రంగస్థలం, సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు, ఓ బేబీ, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి తదితర సినిమాలతో అగ్రనటిగా వెలుగొందారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా కాలం తర్వాత సమంత మా ఇంటి బంగారం సినిమాతో తెలుగు వారిని పలకరించనున్నారు. ఈ మూవీ జూన్ 19న విడుదల కానుంది.

బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాండ్ దువ్వూరులు కలిసి నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ యాంకర్ సుమ కనకాల నిర్వహించిన సుమ ఛాట్ షాలో పాల్గొన్న సామ్.. తన కెరీర్ బిగినింగ్ డేస్‌ను గుర్తుచేసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

Samantha Ruth Prabhu Reveals Her Struggles Before Becoming a Star at Chat Show with Suma

షోలో భాగంగా సమంత మోడల్‌గా నటించిన ఓ యాడ్‌ను సుమ ప్లే చేసి చూపించింది. అది చూసి అంతా షాక్ అయ్యారు. దీని గురించి సమంత చెబుతూ.. కాలేజీలో చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం ఇలా చేశా. హోటల్స్‌లో పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ జరిగేటప్పుడు రిసెప్షన్ దగ్గర కొంతమంది అమ్మాయిలు నిలబడి అతిథుల మీద పన్నీరు చల్లుతారు. అదే నేను చేసిన మొదటి జాబ్. దానికి గాను రోజుకు 500 రూపాయలు ఇచ్చేవారు. నేను సంపాదించడం చూసి నా ఫ్రెండ్స్ కూడా పాకెట్ మనీ సంపాదించుకుందామని అనుకున్నారు. కానీ వాళ్లకు పని ఎలా ఉంటుందనేది తెలియదు. ఇదేముంది నేను కూడా చేయగలుగుతానని ఇద్దరు వచ్చారు. కేవలం 5 నిమిషాలకే అక్కడి నుంచి పారిపోయారని సమంత తెలిపారు.

కానీ 500 రూపాయల కోసం 8 గంటలు నిలబడే ఉండాలి. ఏదో ఒకటి సాధించాలనే కసి ఉండేదని సమంత అన్నారు. ఇంతలో నందినీ రెడ్డి జోక్యం చేసుకుంటే సమంత మెరిట్ స్టూడెంట్, చదువులో టాపర్. ఆస్ట్రేలియా వెళ్లాలని కలలు కన్నారని చెప్పారు. తనను ఆస్ట్రేలియా పంపలేదని మోడలింగ్, సినిమాల కోసం ఆడిషన్స్ ఇచ్చానని సమంత గుర్తుచేసుకున్నారు. ఏదో ఒక రాయి వేద్దామని అనుకున్నా అలా జరిగిపోయిందని చెప్పారు.

ఆ వెంటనే రాజ్ నిడిమోరు నిడిమోరు మాట్లాడుతూ.. మొన్న చెన్నైకి వెళ్లినప్పుడు సమంత ఒక షాపు చూపించింది. అది చాలా చిన్న షాపు.. అక్కడ కొనాలని సామ్ పట్టుబట్టింది. ఆ షాపుకు ఒకప్పుడు సమంత మోడల్‌గా చేసిందన్నారు. అక్కడ ఎప్పటికైనా కొనాలని ఒకప్పుడు కలలు కన్నాను.. అది తీరిపోయింది. కానీ మనిషి జీవితంలో ప్రతిసారి కోరికలు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఇక చాలు అనుకున్నా.. సంతోషం, సంతృప్తిని మించినవి ఏవీ లేవని అర్ధం చేసుకున్నాను. లేదంటే నేను కూడా ఈ చట్రంలో ఇరుక్కుపోయేదానిని.. దానికి ఎప్పటికీ ఎండ్ కార్డ్ పడదని సమంత తెలిపారు. ప్రస్తుతం సమంత వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ఆమె పడిన కష్టంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X