Samantha review on Shaakuntalam గుణశేఖర్..మీరు జీవం పోశారు.. సమంత ప్రశంసల వర్షం
మహాకవి కాళిదాసు రచించిన శాకుంతల గ్రంథం ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమా గుణ నిర్మించిన చిత్రం శాకుంతలం. సమంత రుత్ ప్రభు, దేవ్ మోహన్ జంటగా ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాను ఇటీవల సమంత రుత్ ప్రభు చూసి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారంటే?

ప్రతికూల పరిస్థితుల్లో షూటింగ్
శాకుంతలం సినిమాను నవంబర్ 2020లో ప్రకటించారు. దర్శకుడు గుణశేఖర్ షూటింగును 2021లో ప్రారంభించారు. అయితే కోవిడ్ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొన్నది.

శాకుంతలం రిలీజ్ వాయిదా ఎందుకంటే?
అయితే పోస్టు ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో సమంత అరుదైన వ్యాధి మయోసైటిస్‌కు గురి కావడం తెలిసిందే. ఆ కారణంగా కొంత, అలాగే కోవిడ్ పరిస్థితుల కారణంగా ఆగిపోయిన సినిమాలు పోటాపోటీగా రిలీజ్ కావడంతో డేట్స్ సమస్య వల్ల శాకుంతలం సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు.
ప్రస్తుతం శాకుంతలం సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాకుతలం సినిమాను దిల్ రాజు, గుణశేఖర్, నీలిమాతో కలిసి సమంత చూడటం జరిగింది.

అద్బుతంగా సినిమా అంటూ సమంత
శాకుంతలం సినిమా చూసిన తర్వాత సమంత ట్విట్టర్‌లో స్పందించారు. ఎట్టకేలకు శాకుంతలం సినిమా చూశాను. గుణశేఖర్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎంతో అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. చారిత్రాత్మక కథకు మీరు జీవం పోశారనే విధంగా శాకుంతలం సినిమాను తీశారు.
నా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎప్పుడెప్పుడు సినిమాను చూపించాలా అనే ఆతృత, కోరిక ఉంది. నా అభిమానులు, సినీ ప్రేక్షకులు పవర్‌ఫుల్ ఎమోషన్స్‌లో తడిసి ముద్దవుతారనే భావన ఉంది అని సమంత ట్వీట్‌లో పేర్కొన్నారు.
వండర్ ఫుల్ జర్నీ అంటూ
శాకుంతలం సినిమాను పిల్లా పాపలతో కుటుంబ సభ్యులంతా చూడాలి. మీరంతా ఓ మ్యాజిక్ వరల్డ్‌ను చూడబోతున్నారు. ఈ వండర్‌ఫుల్ జర్నీలో భాగమైన నిర్మాత దిల్ రాజు, నీలిమా గుణకు థ్యాంక్యూ. శాకుంతలం సినిమా నా హృదయానికి దగ్గరగా ఉండే సినిమా అని సమంత ఆనందంతో పొంగిపోయి ట్వీట్ చేసింది.
శాకుంతలం టీమ్ వివరాలు
నటీనటులు: సమంత రుత్ ప్రభు, దేవ్ మోహన్, సచిన్ కేడ్కర్, అదితి బాలన్, ప్రకాశ్ రాజ్, గౌతమి, కబీర్ బేడి, జిషు సేన్ గుప్తా, కబీర్ సింగ్, వర్షిణి సౌందర్య రాజన్, హరీష్ ఉత్తమన్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణశేఖర్
సినిమాటోగ్రఫి: శేఖర్ వీ జోసెఫ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
మ్యూజిక్: మణిశర్మ
బ్యానర్: గుణ టీమ్ వర్క్స్
డిస్ట్రిబ్యూషన్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-04-14


Click it and Unblock the Notifications











