Samantha Ruth Prabhu స్విట్జర్లాండ్‌లో సమంత హంగామా? ఊ అంటావా బేబి ధరించిన జాకెట్ ధర ఎంతో తెలుసా?
పుష్పలో తాను స్పెప్పులేసిన ఊ అంటావా ఊఊ అంటావా పాట మంచి పేరు, క్రేజ్ తీసుకురావడంతో సమంత రుత్ ప్రభు ఫుల్ స్వింగులో ఉన్నారు. ఇటీవల కాలంలో తాను నటించిన చిత్రాలన్నీ సక్సెస్ బాట పట్టడంతో సంబరాలు జరుపుకొంటున్నారు. కొద్దికాలంగా తన జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనల నుంచి దూరంగా ఉండేదుకు ఆమె ప్రస్తుతం స్విట్జర్లాండ్ పర్యటనలో జీవితంలో మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. అయితే స్విట్టర్లాండ్ పర్యటనలో సమంత ధరించిన దుస్తులు, ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

సమంత వరుస విజయాల తర్వాత
సమంత వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెడితే.. ప్రొఫెషనల్ గ్రాఫ్ జోరు మీద ఉంది. లాక్‌డౌన్‌కు ముందు నటించిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకోవడం, లాక్‌డౌన్ సమయంలో చేసిన తొలి వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌కు మంచి క్రేజ్ లభించడంతో దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్‌ను సంపాదించుకొన్నారు. ఇక ఇటీవల ఆమె నటించిన పుష్ప స్పెషల్ సాంగ్‌కు భారీ ఆదరణ లభించింది. దాంతో సమంత కెరీర్‌కు ఢోకాలేదనే విషయం స్పష్టమవుతున్నది.

దుబాయ్ నుంచి రాగానే..
జీవితంలో చోటు చేసుకొన్న ఒడిడుడుకుల నుంచి బయటపడేందుకు ఇటీవల వరుసగా విహార యాత్రలు చేస్తున్నారు. ఉత్తర భారత్, కేరళలో పర్యటించిన సమంత ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో సేద తిరుతున్నది. స్విట్జర్లాండ్‌లో తనకు ఇష్టమైన ప్రదేశాలను చుట్టి వచ్చే ప్రయత్నం చేస్తున్నది. అంతేకాకుండా విదేశాల్లో హంగామా చేస్తున్నది. ఇటీవల దుబాయ్ పర్యటనకు వెళ్లి వచ్చిన భామ వెంటనే స్విట్జర్లాండ్‌లో వాలింది.

స్విట్జర్లాండ్‌లో అందాల ఆరబోత
స్విట్జర్లాండ్‌లో తనకు ఇష్టమైన మంచు పర్వత ప్రాంతాల్లో సమంత విహరిస్తున్నది. ఎన్నో ఏళ్లుగా ఆడాలనుకొంటున్న ఐస్ స్కేటింగ్ క్రీడను పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నది. ఆ క్రీడలో పాల్గొన్న సమయంలో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అభిమానులు తెగ ట్రెండింగ్ చేస్తున్నారు. సమంత ఫోటోలు జాతీయ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.
పసుపు పచ్చ జాకెట్‌తో అదుర్స్
స్విట్జర్లాండ్‌లో సమంత ధరించిన ఓ జాకెట్స్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మంచు పర్వతల ప్రాంతాల్లో విపరీతమైన చలిని తట్టుకొనేందుకు ధరించిన పసుపు పచ్చ జాకెట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పుడు సమంత ధరించిన జాకెట్ గురించిన వివరాలు అందజేస్తూ ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
జాకెట్స్ ధర ఎంతంటే?
అయితే సమంత ధరించిన జాకెట్ మాంక్లెర్ అనే బ్రాండ్‌కు సంబంధించిందనే విషయం వెలుగులోకి వచ్చింది. దాని ధర అక్షరాల 1.20 లక్షలు అనే విషయాన్ని ఫ్యాన్స్ ప్రస్తావిస్తున్నారు. ఇక ఆమె ధరించిన మరో జాకెట్ కూడా ఖరీదైన కావడం విశేషం. స్విట్జర్లాండ్‌లో సమంత ధరించిన మరో జాకెట్ ఖరీదు 75 వేల రూపాయల అని చెబుతున్నారు. మార్కెట్ ధరను ఈ సందర్బంగా అభిమానులు కోట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Recommended Video

యశోదా సినిమాతో బిజీ బిజీగా
ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం యశోదా సినిమా షూటింగుతో బిజీగా ఉన్నారు. అలాగే ఆమె నటించిన శాకుంతలం సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇక తమిళంలో ఆమె నయనతార, విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న తమిళం చిత్రం కాథూ వాకులా రెండు కాదల్ చిత్రం, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ శంతరుబన్ శేఖర్ రూపొందించే చిత్రంలో, ఫిలిప్ జాన్ రూపొందించే అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











