Samantha Ruth Prabhu కనిపించని చోట సమంతకు టాటూ.. ఆ ప్లేస్‌లో చెరగని ప్రియుడి పచ్చబొట్టు సంతకం!

దక్షిణాదిలో అగ్ర తార సమంత రుత్ ప్రభు కెరీర్‌ హిట్లు, ఫ్లాపులు అనే సంబంధం లేకుండా గ్రాఫ్ రాకెట్‌లా దూసుకెళ్తున్నది. ప్యాన్ ఇండియా స్థాయిలో తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. ఇటీవల యశోద సినిమాతో భారీ విజయాన్ని, శాకుంతలం మూవీ భారీ ఫ్లాప్‌ను కూడగట్టుకొన్నది. అయితే సిటాడెల్ రూపంలో మరో యాక్షన్ చిత్రంతో రెడీ అవుతున్నది. ఇటీవల విదేశాల్లో జరిగిన సిటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ వేడుకలో సమంత పాల్గొన్నారు. అయితే ఆ సందర్భంగా ఎవరికీ కనిపించని చోట వేసుకొన్న టాటూ అందర్నీ ఆకట్టుకొన్నది. ఆ టాటూ వెనుక కథ ఏమిటంటే?

సమంత రుత్ ప్రభు ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గురించిన విషయాలు అందరికి తెలిసిందే. ఏం మాయ చేశావో సినిమా సమయంలో అక్కినేని వారసుడు నాగచైతన్యతో మొదలైన ప్రేమ పలు రకాల ట్విస్టులతో పెళ్లి వరకు చేరింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకొన్నారు.

 Samantha Ruth Prabhu

ఇక సమంత, నాగచైతన్య దాంపత్య జీవితం అంతా సవ్యంగా సాగుతున్నదన్న సమయంలో అభిమానులకు వారిద్దరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాము ఇద్దరం వైవాహిక జీవితాన్ని రద్దు చేసుకొంటున్నాం. అభిప్రాయ బేధాల వల్ల తాము విడాకులు తీసుకొంటున్నామని సమంత, నాగచైతన్య ఇద్దరు తమ ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా ప్రకటించడం అందర్నీ షాక్ గురిచేసింది.

అయితే నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత ఎలాంటి వివాదాలు లేకుండా తమ జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. సమంత కెరీర్ పరంగా బిజీగా కావడం, అలాగే నాగచైతన్య సినిమాలతోపాటు శోభితా ధూళిపాలతో డేటింగ్ చేస్తూ బీజీగా మారారు. అయితే నాగచైతన్యతో బంధానికి సంబంధించిన పచ్చబొట్టు (టాటూ) గుర్తు మాత్రం సమంతను వదలడం లేదనే తాజాగా స్పష్టమైంది.

 Samantha Ruth Prabhu

నిర్మాతలు రూసో బ్రదర్స్ ఇటీవల లండన్‌ ఏర్పాటు చేసిన సిటాడెల్ ప్రీమియర్వేడుకలో వరుణ్ ధావన్‌తో కలిసి సమంత రుత్ ప్రభు హంగామా చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం బెక్ హామ్ సతీమణి విక్టోరియా బెక్‌హమ్ తన ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్‌లో సమంత ఫోటో పెట్టి.. నీవు అద్బుతంగా ఉన్నావంటూ కామెంట్ చేశారు.

లండన్‌లో జరిగిన సిటాడెల్ ప్రీమియర్ వేడుకలో మీడియా ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. నల్లటి డ్రస్‌లో అందాల దేవతగా కనిపించారు. ఈ సందర్భంగా తన చంక కింద పక్కటెముకలపై నాగచైతన్య సంతకాన్ని పోలీన టాటూ కెమెరా కంటపడింది. అయితే చైతూను విడిపోయినా గానీ.. తన జీవితంపైనే కాదు.. శరీరంపై చేసిన సంతకం మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతున్నది.

 Samantha Ruth Prabhu

ఇక సిటాడెల్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే. ఇంగ్లీష్, హిందీ వెర్షన్‌లో రూపొందాయి. ఇంగ్లీష్ వెర్షన్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా జోనస్, హిందీ వెర్షన్‌ సిరీస్‌లో సమంత రుత్ ప్రభు నటిస్తున్నారు. హిందీ వెర్షన్ వెబ్ సిరీస్‌‌కు ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంగ్లీష్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 28వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది. ఈ వెబ్ సిరీస్ భారతీయ భాషల్లో కూడా డబ్బింగ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X