Samantha Ruth Prabhu కు బాలీవుడ్‌లో భారీ ఆఫర్లు.. కుర్ర హీరోతో క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్నల్

దక్షిణాది సూపర్ స్టార్ సమంత రుత్ ప్రభు బాలీవుడ్ ఎంట్రీపై గత కొద్దికాలంగా రకరకాల ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారికంగా తన బాలీవుడ్ ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరోసారి తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ గురించిన వార్త ముంబై మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

 ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో సమంత అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంటెన్స్ ఫెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లలో నటించిన తీరు దేశవ్యాప్తంగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఆ తర్వాత సమంతకు బాలీవుడ్‌ నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. ఆ క్రమంలో తాను బాలీవుడ్‌కు వెళ్లాలనే నిర్ణయం కారణంగా తన దాంపత్య జీవితంలో కలతలు వచ్చాయని చెప్పుకొంటారు. అయితే ఆ విషయం పక్కన పెడితే.. భారీ ఆఫర్లను సమంత ప్రస్తుతం సీరియస్‌గా తీసుకొన్నదనే విషయం స్పష్టమవుతున్నది.

 వరుణ్ ధావన్‌తో మూవీ కోసం శిక్షణ

వరుణ్ ధావన్‌తో మూవీ కోసం శిక్షణ


అయితే సమంత ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో ఓ హిందీ సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల కోసం విదేశాలల్లో శిక్షణ పొందుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతూనే మరో బాలీవుడ్ సినిమాపై దృష్టిపెట్టారు. అయితే అక్షయ్ కుమార్‌తో సినిమా చేస్తున్నారనే విషయం ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా, ఆయుష్మాన్ ఖురానాతో సినిమాకు ఒకే చెప్పినట్టు సమాచారం.

దినేష్ విజన్‌తో హారర్ మూవీ

దినేష్ విజన్‌తో హారర్ మూవీ


బాలీవుడ్ మీడియా ప్రకారం.. దర్శకుడు దినేష్ విజన్‌తో హారర్ కామెడీ సినిమాకు సమంత అంగీకరించినట్టు సమాచారం. ఇప్పటికీ ఈ దర్శకుడు మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై స్త్రీ, రూహి సినిమాలు వచ్చాయి. ఈ చిత్రంలో వరుణ్‌ ధావన్‌తోపాటు కీర్తి సనన్ కూడా ఓ పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రంలో సమంత యువరాణి పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.

ఆయుష్మాన్ ఖురానాతో మూవీకి గ్రీన్ సిగ్నల్

ఆయుష్మాన్ ఖురానాతో మూవీకి గ్రీన్ సిగ్నల్


ఇదిలా ఉండగా.. ఆయుష్మాన్ ఖురానాతో మరో భారీ బ్యానర్‌లో సినిమా చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు రూపొందించే మూవీలో నటించడానికి సుముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నట్టు సమాచారం.

యశోదతో హిందీ మార్కెట్‌లోకి

యశోదతో హిందీ మార్కెట్‌లోకి


ఇదిలా ఉండగా, సమంత నటించిన యశోద చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు సంబంధించిన డబ్బింగ్‌ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది అని సినీ యూనిట్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X