వాళ్లపై పోరాటానికి సిద్ధమైన సమంత: ప్లాన్ ప్రకారం అంతా సైలెంట్‌గానే.. ఈ సారి బిగ్ షాక్ ఇస్తుందట!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత. అందానికి అందం.. నటనకు నటన కనబరిచే ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. దీంతోపాటు స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జోరు పెంచి మరీ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సమంత ఇప్పుడు 'యశోద' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీని గురించి ఊహించని న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త? పూర్తి వివరాలు మీకోసం!

అక్కడా ఇక్కడా హవా చూపిస్తోందిగా
సమంత టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పటికీ ఆమె ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ స్టార్ హీరోలతో ఆడిపాడింది. అలా అక్కడా ఇక్కడా హవాను చూపిస్తోంది. దీంతో రెండు చోట్లా దూసుకెళ్తోంది. అంతేకాదు, రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటూ హవాను చూపిస్తోందామె.

అక్కడ కూడా సత్తా చాటిన సమంత
చాలా ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. ఆహా సంస్థ కోసం 'సామ్ జామ్' షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇది సమంత రేంజ్‌ను దేశ వ్యాప్తంగా పెంచుకుందనే చెప్పుకోవాలి.

పాన్ ఇండియా ఫిల్మ్ కంప్లీట్ చేసేసి
ఈ మధ్య సినిమాల వేగం తగ్గించిన సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌లో నటిస్తోంది. షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు హీరోగా నటిస్తుండగా.. అల్లు అర్హ కూడా చేస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

స్పెషల్ సాంగ్ హిట్.. ఇంగ్లీష్ ఫిల్మ్
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. 'ఊ అంటావా మావ ఉఊ అంటావా' అంటూ సాగే ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక, సమంత 'The arrangements of love' అనే ఇంగ్లీష్ మూవీలోనూ నటిస్తోంది. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది త్వరలోనే స్టార్ట్ కానుంది.

‘యశోద’గా మారిపోయిన సమంత
ఈ మధ్య వేగం పెంచిన స్టార్ హీరోయిన్ సమంత.. ఇటీవలే మరో పాన్ ఇండియా ప్రాజెక్టును సైతం ప్రారంభించింది. 'యశోద' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. దీన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు చేస్తున్నారు. మణిశర్మ సంగీతం ఇస్తున్నారు.

ప్లాన్ ప్రకారం అంతా సైలెంట్‌గానే
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న 'యశోద' మూవీని కన్నడం, మలయాళం, హిందీలలో కూడా విడుదల చేయనున్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. అంతేకాదు, ఊహించని విధంగా మొదటి షెడ్యూల్‌ను కూడా వేగంగా పూర్తి చేసేశారు. ఇందులో మెయిన్ లీడ్‌పై చిత్రీకరణ జరిపారు. ఇదంతా చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది.

వాళ్లపై పోరాటానికి సిద్ధమైన సామ్
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'యశోద' మూవీలో మహిళా సమస్యలపై సమంత పోరాటం చేయబోతుందట. అంతేకాదు, ఇందులో ఆమె పాత్ర షాక్‌కు గురి చేసేలా డిజైన్ చేశారని అంటున్నారు. అసలు యశోద ఎవరు? ఆమె ఎందుకు పోరాటానికి దిగింది అనే థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందుతోందని తెలిసింది. దీన్ని మార్చి నాటికి పూర్తి చేస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











