Samantha Ruth Prabhu అంచనాలు పెంచిన ప్యాన్ ఇండియా మూవీ యశోద.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
భావోద్వేగమైన కథ, విభిన్నమైన కథనం, లేడీ ఓరియెంటెడ్ కథా నేపథ్యంతో దక్షిణాది సూపర్ స్టార్ సమంత రుత్ ప్రభు నటించిన చిత్రం యశోద. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ, విమర్శకుల ప్రశంసలు అందుకొన్న సమంత మరోసారి ప్యాన్ ఇండియా స్థాయి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యశోద సినిమా టీజర్ భారీ అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా ప్లాన్ చేస్తున్న ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ సెప్టెంబర్ 9వ తేదీన టీజర్ ఆవిష్కరిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో యశోద చిత్రాన్ని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హరి, హరీస్ జంట దర్శకులుగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు.

రొటీన్‌కు భిన్నంగా విలక్షణమైన పాత్రలో సమంత నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ యశోద చిత్రం ఆద్యంత ఉత్కంఠకు గురిచేయడం కాకుండా సీట్లకు అత్తుకొని ప్రేక్షకులు కొత్త అనుభూతిని అందిస్తుంది. మాస్, కమర్షియల్ అంశాలను మేలవించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ పొందుతుందనే విశ్వాసంతో టీమ్ ఉంది అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు. అద్బుతమైన సాంకేతిక నిపుణులు, యాక్షన్ అంశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని పేర్కొన్నారు.
నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు
దర్శకత్వం: హరి - హరీష్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.
సంగీతం: మణిశర్మ
మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి,
పాటలు: చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి
క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి
కెమెరా: ఎం. సుకుమార్
ఆర్ట్: అశోక్
ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి


Click it and Unblock the Notifications











