జుకాల్కర్ తో సమంత కొత్త వర్క్.. వైరల్ గా మారిన ఫోటోలు!

అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారి మధ్య అనేక ఇబ్బందులు తలెత్తడంతో ఎట్టకేలకు వారు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే ఈ విడాకుల బాధ నుంచి బయట పడేందుకు ఆమె తన సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతోంది. అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మర్చిపోవడానికి కూడా

మర్చిపోవడానికి కూడా

నటి సమంతకు తన విడాకులు అనేది చాలా పెద్ద విషయం. అందుకే విడాకులు తీసుకోవడానికి చాలా టైం తీసుకున్న ఆమె ఇప్పుడు విడాకుల వ్యవహారాన్ని మర్చిపోవడానికి కూడా అనేక సమయం తీసుకుంటోంది. చాలా కాలం పాటు అన్ని విషయాలకు బ్రేక్ తీసుకున్న సమంత ఇప్పుడిప్పుడే షూటింగ్లో బిజీ అవడానికి ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే ఆమె వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆమె చేసిన రెండు సినిమాలు విడుదలకు సిద్దం అవుతుండగా మారి రెండు సినిమాలు లైన్ లో పెట్టింది.

ఎప్పటికప్పుడు

ఎప్పటికప్పుడు

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సమంత ఎప్పటికప్పుడు తమ విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. అయితే నటన కాకుండా సమంత ప్రత్యామ్నాయ వృత్తి కోసం చూస్తున్నారా? అంటే ఆమె సోషల్ మీడియా పోస్ట్ అవుననే అంటోంది. అన్నట్టు ఇది నిజం కాదండోయ్ అసలు విషయం ఏమిటంటే సమంత తన స్నేహితురాలు సాధనా సింగ్‌ మేకప్ వేసుకోవడంలో కష్టపడుతుంటే సమంత కూడా ఒక చేయి వేసింది.

 మేకప్ వేయడానికి

మేకప్ వేయడానికి

ఆమె మేకప్ వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించే ఒక ఫన్నీ వీడియోను సమంత పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సమంతతో పాటు ఆమె స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ కొన్ని ఆహ్లాదకరమైన క్షణాలు గడుపుతూ ఉండగా, సమంతా ఆ వీడియో పోస్ట్ చేయడమే కాక ఒక ఆసక్తికరమైన శీర్షికను కూడా పంచుకుంది. ఆమె "పెళ్లి బుకింగ్ ఓపెన్" అని పేర్కొంది.

రెండు సినిమాలు

రెండు సినిమాలు

సమంతా చేస్తున్న సినిమాల విషయానికి వొస్తే ఆమె రెండు సినిమాలను లైన్ లో పెట్టగా ఈ నెలలో 26 వ నుండి 29 వరకూ ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో అల్లు అర్జున్ తో కలిసి చిందు వేయనుంది. నిజానికి ముందు అనేక పేర్లు వినిపించినా సమంతా పేరు ఫైనల్ అయంది. ఒకరకంగా ఇది ఆమె కెరీర లోనే మొదటి స్పెషల్ సాంగ్.

Recommended Video

Pushpa లో Samantha ఐటెం సాంగ్.. కండిషన్స్ అప్లై..! || Filmibeat Telugu
 చూడాలి మరి

చూడాలి మరి

ఈ సాంగ్ షూటింగ్ చేయడం కోసం సమంత అనేక కండిషన్ లు కూడా పెట్టిందని ప్రచారం జరుగుతుండగా దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు. సినిమా కోసం భారీ ఎత్తున ఛార్జి చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా అది నిజం కాదని తర్వాత మళ్లీ వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా చేసిన తర్వాత ఆమె కెరీర్ లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X