Samantha Divorce rumours: మీకు కాస్తయినా బుద్ధి ఉందా? తిరుమలలో సమంత ఆగ్రహం
దక్షిణాదిలో అగ్రతార సమంత రుత్ ప్రభు మరోసారి వివాదంలో చిక్కుకొన్నారు. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకొంటున్నారనే రూమర్ల మధ్య సమంత తొలిసారి బాహ్య ప్రపంచానికి కనిపించారు. విడాకుల వార్తల మధ్య ఆమె తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమయ్యాయి. తిరుమల పర్యటన సందర్బంగా సమంత చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..

నాగచైతన్యతో విడాకులు అంటూ
కొద్ది రోజులుగా సమంత, నాగచైతన్య విడిపోయారంటూ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. కానీ అధికారికంగా ఎవరూ ఏమి మాట్లాడకపోవడంపై ఊహాగానాలు మరింత జోరందుకొన్నాయి. అటు సమంత గానీ, నాగచైతన్య గానీ తమ విడాకుల గురించి మాట్లాడకపోవడం గమనార్హం. అయితే సమంత తన మకాంను ముంబైకి మార్చడంతో నాగచైతన్యతో విడిపోయినట్టు మీడియా ధృవీకరించుకొంటున్నది.

శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో సినిమా
ఇక సినిమాలకు దూరంగా ఉందామని సమంత నిర్ణయం తీసుకొన్నారనే వార్తల మధ్య ఆమె ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారు. ఈ సినిమాకు ఓ యువ దర్శకుడు డైరెక్షన్ చేయబోతున్నారనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వార్త అధికారికంగా వెల్లడి కానున్నది.

బాలాజీని దర్శించుకొన్న సమంత
ఇదిలా ఉండగా, నాగచైతన్యతో విడాకుల వార్తల తర్వాత తొలిసారి సమంత బయట కనిపించారు. తిరుమలలోని బాలాజీ దర్శనం కోసం ఆమె శనివారం తిరుమల వచ్చారు. ఉదయమే శ్రీవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత మీడియా ఆమెను వెంటాడింది. ఒక్క ఫోటోకు ఫోజివ్వమని అడిగితే సమంత వడివడిగా అడుగులేసుకొంటూ ముందుకు వెళ్లింది.
మీకు బుద్ధి ఉందా? అంటూ సమంత
అయితే ఫోటోకు స్టిల్ ఇవ్వమని, ఓ బైట్ ఇవ్వమని అడుగుతూ మీడియా రిపోర్టర్లు వెంబడించడంతో సమంత సహనం కోల్పోయింది. నాగచైతన్యతో విడిపోయారని రూమర్లు వస్తున్నాయి అంటూ ఓ దశలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుడికి వచ్చాను. మీకు బుద్ధి ఉందా అంటూ బుర్రకు చేయి చూపిస్తూ అని కోపంగా కామెంట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గతంలో మీడియాతో మాట్లాడలేదా?
అయితే. గతంలో దేవాలయాలను దర్శించుకొన్నప్పుడు సమంత మీడియాతో మాట్లాడిన సందర్బాలు ఉన్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఆమె మీడియాతో ఎందుకు గొడవ పడ్డారనే విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత వ్యవహారంపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది.

శాకుంతలంగా సమంత అక్కినేని
ఇదిలా ఉండగా, ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే శాకుంతలం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటించిన సంగతి తెలిసిందే. అలాగే నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా కొన్ని చిత్రాల్లు అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఆ చిత్రాల వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











