ఆ సినిమాలో సమంత చెమటలు పట్టించే రొమాన్స్.. పుష్ప ఐటెమ్ సాంగ్ కంటే ఘాటుగా..
టాలెంటెడ్ హీరోయిన్ సమంత సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలను , ఆలోచిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇక సమంత సినిమాకు అవసరమైతే మాత్రం బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించగలరు అని నిరూపించింది. అలాగే పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే త్వరలోనే రాబోతున్న సినిమాలో కూడా ఆమె ఒక రొమాంటిక్ సాంగ్ తో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

కొత్తదనం ఉండేలా
బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపునందుకున్న సమంత ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఆమె ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటుంది. గత ఏడాది వచ్చిన యశోద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొదట సినిమాకు నెగిటివ్ రివ్యూ వచ్చినప్పటికీ మంచి కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

స్థాయి పెంచుకునేలా..
ఇక సమంత కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన స్థాయి పెంచుకునేలా అడుగులు వేస్తోంది. ఇటీవల ఆమె కొంత అనారోగ్యానికి గురి అయినప్పటికీ కూడా మళ్లీ సరికొత్తగా బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా హార్డ్ వర్క్ చేస్తుంది. నిత్యం వ్యాయామం చేస్తూ సమంత తనను తాను సరికొత్తగా మార్చుకుంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఒక్క పాట ద్వారానే..
సమంత పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ తో ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉ అంటావా మావ అనే ఆ లిరిక్స్ కు తగ్గట్టుగా గ్లామర్ తో హావభావాలు ప్రజెంట్ చేసి అమ్మడు ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఒక్క పాట ద్వారానే సమంతకు హిందీలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న పాత్రలను సెలెక్ట్ చేసుకుంది.

గుణశేఖర్ తో శాకుంతలం సినిమా
ఇక సమంత నుంచి త్వరలోనే శాకుంతలం సినిమా కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ తో కూడా చిత్ర యూనిట్ సభ్యులు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అందులో సమంత చేసే శకుంతల పాత్ర కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది అని గుణశేఖర్ ఇదివరకే చాలా నమ్మకంగా తెలియజేశాడు.

గ్లామర్ హైలెట్ అయ్యేలా సాంగ్
అయితే సమంత శాకుంతలం సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ తో కూడా ఆశ్చర్యాన్ని కలిగించబోతున్నట్లు సమాచారం. ఒక పాటను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. మధుర గతమా అనే ఆ పాటలో దేవ్ మీనన్ సమంత హావభావాలు సరికొత్తగా ఉండబోతున్నాయట. సమంత ఎక్కడ కూడా బోల్డ్ గా అనిపించకుండా చాలా సెన్సిటివ్ గా ఆ పాటలో తన గ్లామర్ నీ హైలైట్ చేసినట్లుగా తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తోనే..
శాకుంతల సినిమాపై వర్గం ప్రేక్షకుల్లో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే తెరపైకి తీసుకువస్తున్నారు. దిల్ రాజు మరొక నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అసలైతే ఈపాటీకే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. మరి ఈ సినిమా సమ్మర్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











