రెండో పెళ్లిపై సమంత లీక్.. సామ్ కాబోయే భర్త ఆయనేనా?

ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా సమంత రూత్ ప్రభు కెరీయర్ ను లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ప్రస్తుతానికి 15 ఏళ్ల అనుభవాన్ని పూర్తి చేసుకుంది. 2010లో విడుదలైన 'ఏ మాయ చేశావే' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ చిత్రంతో సమంత రూత్ ప్రభు, నాగ చైతన్యకు పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులూ తీసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య తన సెకండ్ లైఫ్ ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో సమంత రెండో పెళ్లి ఎప్పుడు? ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడితో రిలేషన్ షిష్ లో ఉందని రూమర్లు ఉన్నాయి. కాగా తాజాగా 'కొత్త ప్రయాణం' అంటూ ఆ దర్శకుడితో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నాగచైతన్యతో సమంత రూత్ ప్రభు విడాకులు..
'ఏ మాయ చేశావే' చిత్రం తర్వాత నాగచైతన్య సమంత రూత్ ప్రభు గాఢమైన ప్రేమలో మునిగి తేలారు. దాంతో ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2017 జనవరి 29న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా ప్రశంసలు కూడా అందుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 2021లో జూలై 31న విడిపోతున్నట్టు ప్రకటించారు. దాంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కానీ వారు ఎందుకు విడిపోతున్నారనేది ఇప్పటికీ బయటికి తెలియనివ్వలేదు. ప్రస్తుతం ఎవరి లైఫ్ ను వారు లీడ్ చేస్తున్నారు.

Samantha Ruth Prabhu Shared a Photo With Director Raj Nidimoru

సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి..
నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు సింగిల్ గానే ఉన్నారు. 2022 మధ్యలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో 2024 డిసెంబర్ లో నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి పీటలు ఎక్కారు. ఈ క్రమంలో సమంత రూత్ ప్రభు మళ్లీ పెళ్లి చేసుకుంటుందా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడితో సామ్ డీప్ రిలేషన్ షిప్ లో ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా తన రెండో పెళ్లిపై పరోక్షంగా స్పందించినట్టు తెలుస్తోంది.

ఆయనతో 'కొత్త ప్రయాణం' అంటున్న సామ్..
సమంత రూత్ ప్రభు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్ షిప్ లో ఉందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. వీటిపై గతంలో సమంత ఎప్పుడూ స్పందించలేదు. ఇక తాజాగా 'కొత్త ప్రయాణం' అంటూ కొన్ని ఫొటోలను పంచుకుంది. అందులో రాజ్ నిడిమోరు ఫొటోను కూడా షేర్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె రెండో భర్తగా రాజ్ నిడిమోరును సామ్ పరిచయం చేస్తుందా? ఏంటనేది చర్చకు దారి తీసింది. మరోవైపు సామ్ పెట్ డాగ్ కూడా రాజ్ నిడిమోరుతో ఎంతో దగ్గరగా ఉండటం కడా సామ్, రాజ్ మధ్య సంబంధాన్ని తెలియజేస్తోందని అంటున్నారు.

సమంత నిర్మించిన 'శుభం' మూవీ..
తన కెరీయర్ లో సమంత రూత్ ప్రభు కొత్త పాత్రను పోషిస్తోంది. నిర్మాతగా మారి 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించింది. ట్రాలాలా అనే ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభించి ఆ బ్యానర్ లో మొదటి సినిమాగా నిర్మించింది. ఈ సినిమా మే9న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం సామ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను ప్రమోట్ చేస్తోంది. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించేలా సినిమాలు చేస్తానని హామీనిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X