Samantha: సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న సమంత పోస్ట్.. ఏం జరిగిందంటే.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ అమ్మడు తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ గా మారింది. అయితే.. అనారోగ్య కారణంగా ఏడాది పాటు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తరువాత టాలీవుడ్ కంటే.. బాలీవుడ్ లో అడుగుపెట్టింది. క్రమంలో ఓరియంటెడ్ కంటెంట్ తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా 'సిటాడెల్‌: హనీ బన్నీ'అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ సమంత తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పెట్టింది. ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.

సమంత 'ఏమాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తొలి సినిమాలో తన అందం, అభినయంతో అందరినీ తమ మాయలో పడేసుకుంది. తన డెబ్యూ మూవీనే హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకుల మదిలో కూడా చోటు దక్కించుకుంది. ఆ తరువాత సమంతకు వరుస అవకాశాలు అందుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోల సరసన నటించి, చాలా తక్కువ సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఒక్కరు గా నిలిచింది.

Samantha Ruth Prabhu shares an inspirational poem ahead of Naga Chaitanya Shobhitha Dhulipala
తన కెరీర్ లో ఉన్నప్పుడే.. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు పెద్దలను ఒప్పించి.. మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కానీ, ఇరువుల మధ్య మనస్పర్థలు రావడంతో వీరి పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా మారింది. విడాకులు తీసుకొని ప్రస్తుతం తమ జీవితం తాము కడుపుతున్నారు. కానీ, త్వరలో నాగ చైతన్య మరో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇదెలా ఉంటే.. విడాకుల తర్వాత సామ్ మయోసైటీస్ (Myositis)అనే వ్యాధితో బారినపడుతుంది. ఈ క్రమంలో ఆ అమ్మడు సినిమాలకు ఓ ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది.

కాస్త కోలుకున్నా.. తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో నటించింది. ప్రస్తుతం సీరిస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. హాలీవుడ్‌ నటుడు రిచర్డ్ మ్యాడెన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్‌: హనీ బన్ని' వెబ్ సిరీస్‌కు ఇది ఇండియన్ సీక్వెల్ గా వచ్చింది. ఈ సీరిస్ లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. సమంత నటనకు మంచి గుర్తింపు వచ్చింది. పలువురు ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు.

Samantha Ruth Prabhu shares an inspirational poem ahead of Naga Chaitanya Shobhitha Dhulipala

సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత ఇన్ స్ట్రామ్ వేదికగా ఓ మోటివేటివ్ పోయమ్ ( సూర్తిదాయక పద్యం)ను షేర్‌ చేశారు. జీవితంలో ఎదురై సవాళ్లకు తలవంచకు అనే పంక్తులతో ప్రారంభమతోంది. 1 రుడ్‌యార్డ్ కిప్లింగ్ రచించిన ప్రసిద్ధ కవిత "ఇఫ్".. మీ చూట్టూ ఉన్న ప్రతికూలతలు, విమర్శలు , మిమ్మల్నీ గందరగోళాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రశాంతంగా.. మీ సమగ్రతను కాపాడుకోగల శక్తినీ, హేతుబద్ధమైన ఆలోచనను కొనసాగించడం. మీ చుట్టూ ఉన్న వాటిపై మీరు నియంత్రణ లేదా ప్రశాంతతను కోల్పోతున్నప్పుడు.. మీపై నిందలు వేయడం. ఇతరులు మిమ్మల్ని అన్యాయంగా నిందిస్తున్నప్పడూ ధైర్యంగా ఎదుర్కొండి. మిమ్మల్ని మీరు విశ్వసించేటప్పుడు.. ఇతరులు కూడా మిమ్మల్నీ నమ్ముతారని అర్థం చేసుకోండి.' అనే పద్యాన్ని షేర్ చేశారు సమంత.

మొత్తానికి మీ చుట్టూ ఉన్న ప్రతికూలతకు గందరగోళానికి గురికాకుండా.. ఇతరుల దృక్కోణాల పట్ల సానుభూతితో ఉంటూనే ఆత్మవిశ్వాసాన్ని కొనసాగిస్తుందని దీని అర్థం. ఈ పద్యం తనలో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X