Samantha: బెడ్‌రూంలో నా భర్త నిర్వాకం ఇలా... రాజ్ నిడిమోరుపై సమంత పోస్ట్ వైరల్
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్నారు సమంత. వ్యక్తిగత జీవితంలో ఎదురైన బాధ నుంచి కోలుకోవడానికి ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రలు చేయడం, యోగా, ధ్యానం వైపు వెళ్లారు సామ్. ఇంతలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడి దాని నుంచి ఎంతో కష్టపడి కోలుకున్నారు. వ్యాధితో బాధపడుతూనే చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేశారు సమంత. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడం సమంత బాగా కృంగిపోయారు. సినిమాలకు గ్యాప్ ఇచ్చి తిరిగి రీఛార్జ్ అయ్యే ప్రయత్నం చేశారు.
రాజ్‌తో పెళ్లి, వైవాహిక జీవితం
ఈ దశలో హిందీలో ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సిరీస్‌లతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించారు. ఈ వెబ్‌సిరీస్‌ల షూటింగ్ సమయంలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని మీడియా కోడై కూసింది. అయినప్పటికీ ఇద్దరూ బయటపడకుండా సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. అప్పటికే రాజ్‌కు పెళ్లయిన సంగతి తెలిసిందే. రాజ్‌తో సమంత సాన్నిహిత్యం మరింత పెరగడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియా కోడై కూసింది. దీనిని నిజం చేస్తూ గతేడాది డిసెంబర్ 1వ తేదీన తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు రాజ్- సమంత. తనకెంతో ఇష్టమైన కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి చెందిన ఈషా ఫౌండేషన్ ఆవరణలో భూత శుద్ధి ప్రక్రియ అనే సాంప్రదాయంలో సమంత - రాజ్ పెళ్లి చేసుకున్నారు.

వరుస ప్రాజెక్ట్స్‌తో రేసులోకి సమంత
రాజ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సామ్.. తను నిర్దేశించుకున్న లక్ష్యాల దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగులో మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నారు. సమంత స్నేహితురాలు నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇది కాకుండా తన వ్యాపారాలు, పికెల్ బాల్ లీగ్, కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు సమంత.
సల్మాన్ సరసన సమంత?
తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని సమంత అందుకున్నట్లుగా బీటౌన్‌లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ది ఫ్యామిలీమెన్, సిటాడెల్ సిరీస్‌లతో జాతీయ స్థాయిలో సమంతను నిలబెట్టిన రాజ్ నిడిమోరు.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన భార్యను తిరుగులేని నటిగా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. సమంత - సల్మాన్ ఖాన్ ప్రాజెక్ట్‌కి సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన విడుదల కానుంది.

ఆ ఫోటోలతో సమంత షాక్
ఇకపోతే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఏకంగా తన బెడ్‌రూం ఫోటోలు షేర్ చేసి షాకిచ్చారు సామ్. వీటిలో తన భర్త రాజ్ నిడిమోరు లాప్‌టాప్ ముందు పెట్టుకుని సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ కనిపించాడు. బెడ్‌రూంలో పడుకోకుండా వర్క్ చేస్తున్నాడని.. తన భర్త చాలా హార్డ్ వర్కర్ అని చెప్పే ఉద్దేశంతోనే సమంత ఈ ఫోటోలు షేర్ చేసి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications
















