Samantha Ruth Prabhu: శుభవార్త చెప్పిన సమంత.. పర్సనల్ లైఫ్‌పై ఊహించని నిర్ణయం

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది భామలు స్టార్ హీరోయిన్లుగా హవాను చూపిస్తున్నారు. కానీ, కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసిన ఈ భామ.. ఆ తర్వాత తన రేంజ్‌ను భారీగా పెంచుకుంది. అయితే, అనారోగ్య కారణంగా సినిమాలకు దూరం అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత ఓ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు మీకోసం!

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి సమంత రూత్ ప్రభు వరుస పెట్టి మూవీలు చేస్తూనే వచ్చింది. అయితే, అప్పట్లో గ్లామరస్ రోల్స్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం పంథాను మార్చుకుంది. ఫలితంగా ప్రయోగాత్మక చిత్రాలను చేస్తోంది. అందులోనూ లేడీ ఓరియెంటెడ్ మూవీలను చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తూ వచ్చింది.

Samantha Ruth Prabhu Shares Good News About Her Acting Career

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' తర్వాత నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయిన సమంత రూత్ ప్రభు.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్‌పై ప్రభావాన్ని చూపించే దీనివల్ల ఆమె ఆరోగ్యం క్షిణిస్తోంది. దీంతో చాలా రోజుల పాటు షూటింగ్ ఆపేసి మరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఇప్పుడేమో సినిమాలకు దూరంగా ఉంటోంది.

అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న సమంత రూత్ ప్రభు.. తన అభిమానులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా సోషల్ మీడియా ద్వారా వాళ్లతో ముచ్చటిస్తోంది. ముఖ్యంగా తన ఫొటోలు, వీడియోలను సైతం తరచూ షేర్ చేస్తూనే ఉంటోంది. ఇలా సినిమాలకు విరామం ప్రకటించినా.. ఫ్యాన్స్‌కు మజాను మాత్రం పంచుతూ ముందుకు సాగుతోంది.

చాలా రోజులుగా సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటూ తన హెల్త్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోన్న సమంత.. తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సమంత సెల్ఫీ వీడియోను స్టోరీగా పెట్టుకుంది. అందులో తన ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని చెప్పిన ఈ భామ.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై కూడా క్లారిటీ ఇచ్చింది.

Samantha Ruth Prabhu Shares Good News About Her Acting Career

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోలో సమంత 'ఇప్పటికే చాలా మంది మీరు షూటింగ్‌లో మళ్లీ ఎప్పుడు పాల్గొంటారు? బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడు కనిపిస్తారు? అని అడుగుతున్నారు. ఆ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. త్వరలోనే షూటింగ్‌లలో పాల్గొనబోతున్నాను. అతి త్వరలోనే సినిమాల్లో కనిపించబోతున్నాను' అని తెలిపింది.

అదే వీడియోలో సమంత కొనసాగిస్తూ.. 'సినిమాలు లేకపోవడం వల్ల నేను జాబ్‌లెస్ (ఖాళీ)గానే ఉన్నాను. ఈ సమయంలోనే నా స్నేహితులతో కలిసి ఓ హెల్త్ పోడ్ కాస్ట్ (ఆరోగ్యంపై చర్చా కార్యక్రమం) చేశాను. దానికి సంబంధించిన వీడియో త్వరలోనే విడుదల కాబోతుంది' అంటూ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తానికి సమంత కోలుకుని సినిమాల్లోకి వస్తున్నట్లు చెప్పేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X