అర్ధరాత్రి అతడి నుంచి సమంతకు మెసేజ్‌లు.. వద్దన్నా వదలకుండా.. వైరల్‌గా మారిన స్క్రీన్ షాట్స్
'ఏమాయ చేశావే' అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి తనదైన నటన, అందంతో అందరినీ మాయ చేసేసిన బ్యూటీ సమంత రూత్ ప్రభు. ఆరంభంలోనే ఎన్నో అవకాశాలను అందుకున్న ఈ భామ.. వాటిని సద్వినియోగం చేసుకుని స్టార్‌గా మారిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతూనే ఉంది. అయితే, ఈ మధ్యన కాస్త గ్యాప్ తీసుకున్న సమంత.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఊహించని పోస్టులు చేసింది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి!
హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన తర్వాత సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వచ్చింది. అయితే, అప్పట్లో గ్లామరస్ రోల్స్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం పంథాను మార్చుకుంది. ఫలితంగా ప్రయోగాత్మక చిత్రాలను చేస్తోంది. అందులోనూ లేడీ ఓరియెంటెడ్ మూవీలను చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది.

ఈ మధ్య కాలంలో నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయిన సమంత రూత్ ప్రభు.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్‌పై ప్రభావాన్ని చూపించే దీనివల్ల ఆమె ఆరోగ్యం క్షిణిస్తోంది. దీంతో చాలా రోజుల పాటు షూటింగ్ ఆపేసి మరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఇప్పుడేమో సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది.

ఆరోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటోన్న సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu).. తన అభిమానులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా సోషల్ మీడియా ద్వారా వాళ్లతో ముచ్చటిస్తోంది. ముఖ్యంగా తన ఫొటోలు, వీడియోలను సైతం తరచూ షేర్ చేస్తూనే ఉంటోంది. ఇలా సినిమాలకు విరామం ప్రకటించినా.. ఫ్యాన్స్‌కు మజాను మాత్రం పంచుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత రూత్ ప్రభు.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వరుసగా కొన్ని స్టోరీలను పెట్టుకుంది. అందులో తన మొబైల్‌లో తీసుకున్న స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. ఇందులో సమంత రూత్ ప్రభుకు తన జిమ్ ట్రైనర్ మెసేజ్‌లు చేయడం కనిపించింది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఇంతకీ ఆ స్క్రీన్ షాట్‌లో ఏముందంటే.. జిమ్ ట్రైనర్ సమంతను ఉదయం 11 గంటలకు మొదలు పెడదామా అని అడిగాడు. దీనికామె ఓకే అని బదులిచ్చింది. కాసేపటి తర్వాత 'నేను ఈరోజు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నా. బాడీ పెయిన్స్ వస్తున్నాయి' అని మెసేజ్ చేసింది. కానీ, ఆ జిమ్ ట్రైనర్ మాత్రం కరెక్టుగా 11 గంటలకు సమంతను వర్కౌట్‌కు రమ్మని పిలిచాడు.

ఆదివారం అయినా, ఆరోగ్యం బాలేకపోయినా తనను జిమ్ ట్రైనర్ వదలడం లేదని ఫన్నీగా చెప్పడానికే సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఈ స్క్రీన్ షాట్ షేర్ చేసింది. అంతేకాదు, ఆ వెంటనే జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న మరో ఫొటోను కూడా షేర్ చేసింది. మొత్తానికి సమంత ఏ రేంజ్‌లో కష్టపడుతుందో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











