అధ్యాత్మిక గురువుతో సమంత.. చైతు, శోభితా వల్లే అంటూ నెటిజన్లు ట్రోలింగ్ (ఫోటోలు)
సౌత్ క్వీన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలిసినప్పటి నుంచి వైద్య పరంగా చికిత్స తీసుకోవడంతో పాటు ఆధ్యాత్మికతకు కూడా ప్రాధాన్యతను ఇస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సద్గురు సన్నిధిలో కనిపించింది. ఆ ఫోటోలను సామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. మరి ఇంకా సమంత పోస్ట్ ను చూడకపోతే ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కెయ్యండి.
సమంత జూన్ 11న సద్గురు ఈషా ఫౌండేషన్ ను సందర్శించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందులో పలు ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు సుధీర్ఘ నోట్ ను రాసుకొచ్చింది. మనలో చాలా మంది గురువు కోసం వెతుకుతారు. మీ జీవితాన్ని మరింత ప్రత్యేకంగా చేసే అవగాహన, కరుణతో కూడిన వ్యక్తిని మీరు కనుగొన్నప్పుడు అది మరింత స్పెషల్ అవుతుంది. మీకు జ్ఞానం కావాలంటే ఈ ప్రపంచంలో వెతకాలి. ప్రతిరోజూ ఎదురయ్యే సమస్యలను ఇది సాధారణమే అని అనుకుంటారు. కానీ ఇదేం మామూలు విషయం కాదు. మీరు దాని గురించి కేవలం తెలుసుకుంటే సరిపోదు కష్టపడాలి. నాలెడ్జ్ ను ఇంప్లిమెంట్ చేయడం అనేది నిజంగా చాలా ముఖ్యమైనది అంటూ సమంత రాసుకొచ్చింది.

ఇక ఈ ఫోటోలో ఆమె సద్గురు సన్నిధిలో నేలపై కూర్చుని ధ్యానం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఆమె చుట్టూ చాలా మంది భక్తులు ఉన్నారు. మినిమల్ యాక్సెసరీస్ తో కూడిన సాధారణ బ్లాక్ కుర్తా సెట్ లో సమంత ధ్యానం చేస్తూ అందంగా కనిపించింది. అయితే సమంత సద్గురు ఆధ్యాత్మిక సంస్థను సందర్శించడం అనేది ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూలైలో కూడా సద్గురు సన్నిధానంలో తాను ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
ఇక తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే నాగ చైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో ఉన్నాడు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ టెన్షన్ ను పక్కన పెట్టడానికే సమంత ఇలా సద్గురు సన్నిధానంలో ధ్యానం చేస్తోందని అంటున్నారు.
ఆమె అభిమానులు మాత్రం ఫుల్ జోష్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ఆమె ఇలా మరింత శక్తిని కూడగట్టుకుంటోంది, మెంటల్ గా స్ట్రాంగ్ అవుతోంది అంటూ సామ్ కు సపోర్ట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సమంత బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.
ఇది ఇండియన్ వెబ్ సిరీస్ కాగా, అమెరికన్ వెర్షన్ సిటాడెల్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ జంటగా నటించారు. ఈ సిరీస్ తో పాటు సమంత తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటించబోతోంది. అలాగే సమంత అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లోని పాన్ ఇండియా సినిమాలో కూడా నటిస్తోందని రూమర్లు నడుస్తున్నాయి.


Click it and Unblock the Notifications











