నాగచైతన్యతో ఆ మూవీలో.. అలా చేసినందుకు సిగ్గనిపిస్తుంది.. సమంత

స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నాళ్ల పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతూనే ఉంది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందింది. సినిమా సినిమాకు క్రేజ్ దక్కించుకుంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తెలుగుతో పాటు, తమిళం, హిందీ చిత్రాల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.

ఇక సమంత రూత్ ప్రభు ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తూ ఫుల్ బిజీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ లేకున్నా.. త్వరలో తన లైనప్ మొత్తం బాలీవుడ్ లోనే ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమాల్లో నటించడం బాగా తగ్గించిందని తెలుస్తోంది. చివరిగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' చిత్రంలో నటించి తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. కాగా ఇప్పుడు తెలుగులో సమంత నటించే సినిమాలేవీ లేకపోయినా.. ఆమె నిర్మాతగా మారి తెలుగు పరిశ్రమలో కొత్త పాత్రను పోషిస్తోంది.

Samantha Ruth Prabhu Shocking Comments about movie with Akkineni Naga Chaitanya

సమంత రూత్ ప్రభు నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం 'శుభం'. ఆరుగురు హీరోలను పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రెగుల దర్శకత్వం వహిస్తున్నారు. మే 9న మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా సమంత మూవీ ప్రచార కార్యక్రమాలను తానే దగ్గరుండి నిర్వహిస్తోంది. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో సమంత సినిమా గురించి మాట్లాడి హైప్ పెంచింది. ఈ క్రమంలోనే తన పాత సినిమాలను గుర్తు చేసుకుంది.

తన మొదటి చిత్రాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది... నా మొదటి ఒకటి, రెండు సినిమాలు చూస్తే సిగ్గుగా ఉంది. అందులో అలా నటించానా? అని సిగ్గు అనిపిస్తుంది.. అంటూ వ్యాఖ్యానించింది. తన కెరీర్ ప్రారంభం అక్కినేని నాగచైతన్య 'ఏ మాయ చేసావె' చిత్రంతో అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో సమంతకు మంచి పేరు దక్కింది. కానీ సమంతకు ఆ మూవీలో తన యాక్టింగ్ పెద్దగా నచ్చలేదని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. సామ్ బాగానే నటించిందని అభిమానులు అంటున్నారు.

ఇక మరోవైపు సమంత చివరిగా బాలీవుడ్ లో రూపు దిద్దుకున్న యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'సిటాడెల్' తో అలరించింది. ఈ సీరిస్ లో యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టింది. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 2వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు హిందీలో సమంత 'రక్త్ భ్రమరాండ' అనే చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇక అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా 'తండేల్'తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. నెక్ట్స్ కార్తీక్ దండు దర్శకత్వంలో తన 24వ సినిమాలో నటించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X