రిలేషన్‌షిప్‌లో ఆ తప్పులు చేయొద్దు... సమంత షాకింగ్ కామెంట్స్

తెలుగు తెరకు మూడేళ్లుగా దూరంగా ఉంటున్న అగ్రనటి సమంత చాలాకాలం తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సమంత నటన, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మా ఇంటి బంగారం ఫస్ట్ వీక్ లోపే 50 కోట్ల రూపాయలు వసూలు చేసి దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జూన్ 19న హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకకు సమంత, రాజ్ నిడిమోరు, నందినీ రెడ్డి, శ్రీముఖి, హిమాంక్ దువ్వూరు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిలేషన్‌షిప్‌పై సమంత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అంటాను. కానీ మీ లైఫ్‌లోకి ఆయన వచ్చాక ఒక పెద్ద సక్సెస్ కొట్టారు. ప్రస్తుత జనరేషన్‌లో ఒక మగాడిని ఎంచుకునే విషయంలో అమ్మాయిలు చాలా తడబడుతున్నారు. అలాంటి వాళ్లకు మీరేం చెప్పాలని అనుకుంటున్నారు అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి సమంత ఆన్సర్ ఇచ్చారు. చాలా ఆలోచించాలి.. కెరీర్‌లో ఏం జరిగినా అది మన చేతిలో ఉంటుందని సమంత అన్నారు.

Samantha Ruth Prabhu Shocking comments on Relationship at Maa Inti Bangaram Success Meet

కానీ రిలేషన్‌షిప్‌లో అలా కాదు.. అది చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. అందులో జరిగేవి మన కంట్రోల్‌లో ఉండవు. ఇద్దరు వ్యక్తుల చేతుల్లో రిలేషన్‌షిప్ ఉంటుంది. నా జీవితంలో నేను చూసినంత వరకు అమ్మాయిలకు ముందు తన మీద తనకు నమ్మకం ఉండాలి. అప్పుడే సరైన వ్యక్తిని ఎంచుకోగలుగుతాం, లేదంటే తప్పులు జరుగుతాయి. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి అది కరెక్ట్ కాదు. ముందు మిమ్మల్ని మీరు పరిపూర్ణమైన వ్యక్తిగా మలచుకుని ఆ తర్వాతే ఎదుటి వ్యక్తిని చూడండి అని యువతకు సమంత సలహా ఇచ్చారు.

చివరిలో దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. సమంత, రాజ్‌గారిని నేను చాలా దగ్గరి నుంచి చూశా. నాకు రాజ్‌గారిలో బాగా నచ్చిన విషయం ఏంటంటే సమంత గారిని ఎవరైనా పొగిడితే ఆయన ఎంత గర్వంగా ఫీల్ అవుతారో నాకు నచ్చుతుంది. అందుచేత మీ సక్సెస్‌ని గర్వంగా ఫీలయ్యే ఒక మగాడిని సెలెక్ట్ చేసుకోండి. రాజ్‌గారు ఎంత హ్యాపీగా ఫీలవుతారో నేను చూశానని చెప్పారు.

అక్కినేని నాగచైతన్యతో విడాకులు సమంత వ్యక్తిగత జీవితంలో పెద్ద కుదుపు.. ఆ వెంటనే మయోసైటిస్ వ్యాధి బారినపడిన ఆమె ఓవైపు చికిత్స తీసుకుంటూనే సినిమాలలో నటించారు. సమంత నటించిన శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. దాంతో సమంత పని అయిపోయిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. వ్యక్తిగత సమస్యలకు తోడు, కెరీర్ పరంగా పరాజయాలు రావడంతో సమంత ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఈ దశలో రాజ్ నిడిమోరుతో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ది ఫ్యామిలీమెన్ 2, సిటాడిల్ వెబ్ సిరీస్‌లలో సమంత నటించారు. ఇవి ఓటీటీలలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే రాజ్‌తో సమంత బంధం మరింత బలపడి ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈశా సెంటర్‌లో రాజ్- సమంతల వివాహం జరిగింది. రెండో పెళ్లి తర్వాత కూడా సమంత నటనను కొనసాగించారు. తనే నిర్మాతగా మా ఇంటి బంగారం సినిమాను తెరకెక్కించారు. దీనికి రాజ్ క్రియేటివ్ హెడ్‌గా, నిర్మాతగా అన్నీ తానై వ్యవహరించి తన భార్యకు విజయాన్ని అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X