Samantha: షాకింగ్ లుక్‌లో సమంత.. ఒక్క క్షణం గుర్తు పట్టలేదు భయ్యా!

తెలుగు సినిమాల్లో సుదీర్ఘ కాలంగా తనదైన ప్రభావాన్ని చూపిస్తూ స్టార్‌గా హవాను చూపిస్తోన్న హీరోయిన్ సమంత రూత్ ప్రభు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ సుందరాంగి.. జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటుతోంది. ఫలితంగా ఎన్నో అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే, ఇప్పుడు షూటింగ్‌లకు గ్యాప్ తీసుకుంటోన్న ఈ భామ.. సరికొత్త లుక్‌తో దర్శనమిచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

అలాంటి సినిమాలతోనే:హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత చాలా కాలం పాటు గ్లామరస్ రోల్స్‌లోనే సమంత రూత్ ప్రభు ఎక్కువగా కనిపించింది. కానీ, ఆ తర్వాత ఈ చిన్నది పంథాను మార్చుకుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ మూవీలతో పాటు తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న చిత్రాలనే చేస్తోంది. ఇలా ఇటీవలి కాలంలో 'యశోద', 'శాకుంతలం'లో నటించింది.

 Samantha Ruth Prabhu Short Hair Video Goes Viral in Internet

ఖుషితో పాటు సీటాడెల్:ప్రస్తుతం సమంత రూత్ ప్రభు.. విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' అనే మూవీలోనూ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తైంది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ కాబోతుంది. దీనితో పాటు సమంత ఇప్పుడు 'సీటాడెల్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇది కూడా వచ్చే సెప్టెంబర్ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

 Samantha Ruth Prabhu Short Hair Video Goes Viral in Internet

వింత వ్యాధి.. పోరాటం:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్‌పై ప్రభావాన్ని చూపించే దీనివల్ల ఆమె ఆరోగ్యం క్షిణిస్తోంది. దీంతో కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. అలాగే, దీని నుంచి కోలుకునేందుకు సమంత మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎంతో పోరాటం చేస్తోంది.

సినిమాలకు దూరంగా:సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సమంత రూత్ ప్రభు.. ఇప్పుడు కెరీర్‌కు గ్యాప్ ఇవ్వబోతుందని ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. ఆమె దాదాపు ఏడాది పాటు సినిమాను గానీ, వెబ్ సిరీస్‌ను గానీ చేయడం లేదని తెలుస్తోంది. ఈ ఖాళీ సమయాన్ని మొత్తం తన ఆరోగ్యాన్ని కాపాడుకునే పనులకు వాడుకోబోతుందని ఇప్పటికే స్పష్టత వచ్చేసింది.

 Samantha Ruth Prabhu Short Hair Video Goes Viral in Internet

అందులో పలకరిస్తూనే:సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస పెట్టి ప్రాజెక్టులు చేస్తోన్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అభిమానులను ఇలా పలకరిస్తూ వాళ్లలో జోష్‌ను నింపుతూనే ఉంటోంది.

 Samantha Ruth Prabhu Short Hair Video Goes Viral in Internet

షాకింగ్ లుక్‌లో సామ్:చేతిలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగ్‌లను కంప్లీట్ చేసుకున్న సమంత.. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే తొలిసారి హెయిర్ కట్ చేసుకుని చిన్న జుట్టుతో ఓ వీడియోను తీసుకుని సోషల్ మీడియాలో వదిలింది. దీంతో ఇది కాసేపట్లోనే వైరల్‌గా మారింది.

అలాంటి కామెంట్లతో:షార్ట్ హెయిర్‌తో కనిపించిన సమంతను చూసి నెటిజన్లు అందరూ అవాక్కవుతున్నారు. ఈ వీడియోపై చాలా మంది సెలెబ్రిటీలు, అభిమానులు మంచి మంచి కామెంట్లను చేస్తున్నారు. ముఖ్యంగా 'సమంత ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది', 'సామ్ అదరగొట్టేశావు', 'ఐలవ్యూ సమంత', 'నువ్వు పూర్తిగా కోలుకోవాలి' అంటూ రిప్లైలు ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X