Samantha స్పోర్ట్స్ బ్రాతో సమంత అరాచకం.. అమాంతం పైకి లేపేసి షాకిచ్చిన హీరోయిన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా హవాను చూపించారు. అయితే, అందులో కొందరిని మాత్రమే ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ఒకరు. 'ఏమాయ చేశావే' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరినీ ఫిదా చేసేసిందీ బ్యూటీ. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుని ఫేమస్ అయింది.

అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఈ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సామ్.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి మరి!

మొదట్లో అలా... ఇప్పుడు ఇలా

మొదట్లో అలా... ఇప్పుడు ఇలా

కెరీర్ ఆరంభంలోనే సమంత వరుస పెట్టి సినిమాలు చేసింది. అందులో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ ఉండేవి. అయితే, ఈ మధ్య కాలంలో ఆమె తన పంథాను పూర్తిగా మార్చుకుంది. మధ్యలో వచ్చిన గ్యాప్‌ను పూడ్చేందుకు వరుసగా సినిమాలు చేయడంతో పాటు తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని మాత్రమే చేస్తోంది. దీంతో ఆమె కెరీర్ మరోసారి ఊపందుకుందనే చెప్పాలి.

 దేశ వ్యాప్తంగా సామ్‌కు గుర్తింపు

దేశ వ్యాప్తంగా సామ్‌కు గుర్తింపు

ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న సమంత.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గత ఏడాది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర బాగా హైలైట్ అవడంతో నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఫలితంగా ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి.

రెండు కంప్లీట్ చేసేసిన బ్యూటీ

రెండు కంప్లీట్ చేసేసిన బ్యూటీ

తెలుగులో కొంత కాలం గ్యాప్ తీసుకున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు. దీనితో పాటు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రాన్ని కంప్లీట్ చేసేసుకుంది.

భారీ ప్రాజెక్టుల్లో భాగమైన భామ

భారీ ప్రాజెక్టుల్లో భాగమైన భామ

స్టార్ హీరోయిన్ సమంత దేశ వ్యాప్తంగా ఫేమస్ అవడమే కాదు.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌కు కూడా తన ప్రస్థానాన్ని తీసుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ తెరకెక్కించే ఈ వెబ్ ఫిల్మ్ 'The arrangements of love' నవల ఆధారంగా రూపొందనుంది. దీనితో పాటు 'యశోద' అనే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ఇప్పటికే సామ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

అందాలను ఆరబోస్తోన్న సామ్

అందాలను ఆరబోస్తోన్న సామ్

స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ బ్యూటీ విపరీతంగా అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రెచ్చగొడుతోంది. ఇలా సమంత తన ఫిగర్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

స్పోర్ట్స్ బ్రాతో సమంత వర్కౌట్

స్పోర్ట్స్ బ్రాతో సమంత వర్కౌట్

తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ హాట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్పోర్ట్స్ బ్రాతో పాటు టైట్ షార్ట్ ధరించి ఉంది. అంతేకాదు, ఇందులో చాలా బరువున్న వెయిట్ లిఫ్టింగ్ చేసి షాకిచ్చింది. ఈ వీడియోలో సమంత అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. విపరీతంగా వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X