అల్లు అర్జున్‌తో ఊ అంటావా సాంగ్.. నన్ను అలా భయపెట్టారు.. సమంత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సమంత రూత్ ప్రభు స్పెషల్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. సమంత రూత్ ప్రభు కెరీయర్ లోనే ఫస్ట్ చేసిన ఆ సాంగ్ ప్రపంచం మొత్తం మోత మోగిపోయింది. అయితే ఆ సాంగ్ చేయడాని కంటే ముందు సినీ ఇండస్ట్రీలోని పలువురు సామ్ ను ఎలా భయపెట్టారో తాజాగా చెప్పుకొచ్చారు. తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా మాట్లాడుకుంటూ వచ్చింది.
ఇండియాను షేక్ చేసిన సాంగ్..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంటగా వచ్చిన ఐకానిక్ ఫిల్మ్ 'పుష్ఫ : ది రైజ్'. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సమంత రూత్ ప్రభు 'ఊ అంటావా' సాంగ్ ఇండియాను షేక్ చేసింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో మారుమోగింది. వరల్డ్ వైడ్ గానూ ఈ సాంగ్ తో సామ్ కు గుర్తింపు దక్కింది. అయితే ఈ సాంగ్ చేయడానికి కంటే ముందు తెర వెనుక చాలా స్టోరీ జరిగింది.

చాలా మంది భయపెట్టారు..
ఊ అంటావా.. మామ.. సాంగ్ గురించి సమంత రీసెంట్ గా మాట్లాడింది. తను నిర్మాతగా తెరకెక్కించిన 'శుభం' మూవీ ప్రమోషన్స్ లో ఈ సెన్సేషనల్ సాంగ్ పై ఇలా స్పందించింది. ఆ సాంగ్ చేయడానికి ముందు చాలా మంది తనను చేయొద్దని భయపెట్టారని చెప్పింది. స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అలాంటి స్పెషల్ సాంగ్ తో ప్రయోగం ఎందుకని ఆమె దగ్గరున్న వారు ఒత్తిడి కూడా తెచ్చారంట. ఏ ఒక్కరూ కూడా ఆ సాంగ్ చేయొద్దనే చెప్పారని వివరించింది. ఒక వేళ చేస్తే కెరీయర్ ఏమైపోతుందోనని భయపెట్టారని చెప్పుకొచ్చింది. అలాగే తను నటించిన 'సూపర్ డీలక్స్' చిత్రం సమయంలోనూ అలాగే భయపెట్టారని తాజాగా గుర్తుచేసుకుంది. ఇప్పుడు ఇక నిర్మాతగానూ సమంత మొదటి అడుగు వేసిన సందర్భంగా గతంలో ఫేస్ చేసిన ఛాలెంజ్ ను నెమరు వేసుకుంది.
సమంత రూత్ ప్రభు కొత్త ప్రయాణం..
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన కెరీయర్ లో కీలకమైన బాధ్యతలను స్వీకరిస్తోంది. ఛాలెంజింగ్ ఫేజ్ లోకి అడుగుపెట్టింది అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హీరోయిన్ గా వందశాతం సక్సెస్ అయిన ఈ స్టార్ బ్యూటీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గానూ మారి ట్రాలాలా అనే బ్యానర్ లో 'శుభం' అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ చిత్రం మే9న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతోంది.
సమంత రాబోయే చిత్రాలు..
సమంత రూత్ ప్రభు చివరిగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' చిత్రంతో అలరించింది. ఆ తర్వాత 'సిటాడెల్ : హనీ బన్నీ' అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో యాక్షణ్ స్టంట్స్ తో అదరగొట్టింది. మా ఇంటి బంగారం.. రక్త్ బ్రహ్మండ్ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











