ప్రతిసారి నేనే రాజీ పడాలా? నా త్యాగానికి అక్కడ విలువ లేదు... సమంత ఎమోషనల్

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడి ఆయనను పెళ్లాడారు అగ్రనటి సమంత. రెండో పెళ్లిలోనూ మరోసారి తెలుగింటికి కోడలిగానే వచ్చారు. వ్యక్తిగత జీవితంలోని సమస్యలను అధిగమిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు సామ్. సినిమాలు, సినిమాల నిర్మాణం, వ్యాపారాలు, పికెల్ బాల్ లీగ్‌తో దూసుకెళ్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తున్నారు సమంత. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రాజ్ నిడిమోరు.. క్రియేటివ్‌ హెడ్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

సల్మాన్ సరసన సమంత?
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సరసన కూడా సమంత ఒక చిత్రంలో నటించబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో ఈసారి ఎలాగైనా జెండా పాతాలని సామ్ గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు ఆమె భర్త రాజ్ నిడిమోరు నుంచి గట్టి మద్ధతు లభిస్తోంది. తొలి నుంచి మహిళల హక్కులు, సమానత్వం, మహిళా సాధికారత అంశాలపై సమంత యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఇండస్ట్రీలోని మహిళల తరపున కూడా మాట్లాడుతుంటారు.

Samantha Ruth Prabhu Speaks on Women s Rights and Safety in Film Industry

మహిళా హక్కులపై గళమెత్తిన సమంత
గతంలో మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలు, లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ బాగోతాలను బయటకు తీస్తూ జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఇదే తరహాలో తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఓ కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పట్లో సమంత డిమాండ్ చేశారు. తాజాగా ఇండస్ట్రీలోని మహిళా హక్కులు, వారి ఇబ్బందులపై జరిగిన ఓ కార్యక్రమంలో సమంత పాల్గొని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రతిసారి క్షమాపణలు వద్దు
హాలీవుడ్ రిపోర్టర్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఇంటర్‌టైన్‌మెంట్ 2026 కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు ఇతరుల కోసం తమ ఇష్టాలను, అభిప్రాయాలను, షెడ్యూళ్లను మార్చుకోవడంతో పాటు లక్ష్యాలను వదులుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ ఇదొక త్యాగం అని గుర్తించలేనంతగా మనం దీనికి అలవాటు పడిపోయాం. క్షమాపణలు చెప్పాల్సిన పరిస్ధితుల్లో మగాడి కంటే మహిళలే ముందుంటున్నారు. ఏకంగా పది రెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతూనే ఉంటారు. అయిన దానికి, కానీ దానికి క్షమాపణలు చెప్పే అలవాటును, రాజీపడటాన్ని మహిళలు మానుకోవాలి. ఇది మీరు కష్టపడి సాధించుకున్న గౌరవమని సమంత పిలుపునిచ్చారు.

ఆడవాళ్లకు సెట్‌లో భద్రత కావాలి
భారతదేశంలో సినీరంగం సురక్షితం కాదు.. అయినప్పటికీ కెరీర్‌గా సినిమాను ఎంచుకునేందుకు మహిళలు వెనుకాడటం లేదు. ఇక్కడ ఉద్యోగ భద్రత, పనిగంటలు వంటివి ఎన్నో ఉంటాయి. ఇన్ని ఇబ్బందుల మధ్య ఇండస్ట్రీలో మహిళలు అడుగుపెడుతున్నారంటే వారికి అపారమైన ధైర్యం కావాలి. ఇక్కడ పురుషుల కంటే మహిళలు ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. అన్ని సినిమాలు ఒకటే.. పురుషులు ప్రధానమైన సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అనేవి ఉండవు. అందువల్ల ఆడవాళ్లు నటించే సినిమాలను ప్రత్యేకంగా చూడటం ఆపాలి. హీరోయిన్ అంటే గ్లామర్, హీరో చుట్టూ తిరిగే సపోర్టింగ్ క్యారెక్టర్‌గా కాకుండా కథానాయకుడిలో ధైర్యాన్ని నింపేలా, పవర్‌ఫుల్‌గా వారి పాత్రలు ఉండాలి. సెట్‌లో మహిళలకు భద్రతతో కూడిన పని వాతావరణాన్ని కల్పించాలని సమంత కోరారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X