పెళ్ళైన బాలీవుడ్ హీరోతో సమంత.. స్వీట్ పర్సన్ అంటూ స్పెషల్ పోస్ట్.. ఫొటో వైరల్

గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గత ఏడాది నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కూడా చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది అనే చెప్పాలి. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకునే ముందు వరకు కూడా సమంత ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ లోనే సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్లో కూడా ఆఫర్లు వస్తుండడంతో మరింత బిజీ అయ్యే విషంగా ప్లాన్ చేసుకుంటోంది. ఇక ఆమె బాలీవుడ్ కూడా స్టార్స్ తో మంచి స్నేహాన్ని పెంచుకుంటోంది. రీసెంట్ గా సమంత ఒక బాలీవుడ్ హీరోతో ప్రత్యేకంగా ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

విడాకుల అనంతరం

విడాకుల అనంతరం

నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన కెరీర్ విషయంపై మరింత ఫోకస్ పెంచింది అనే చెప్పాలి. ముఖ్యంగా ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో సమంత నటించిన విధానం ఒక్కసారిగా ఆమె కెరీర్ ను మరో లెవల్ కి తీసుకెళ్ళింది. అప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ లో బిజీగా కనిపించిన సమంత ఆ తర్వాత హిందీలో కూడా అడుగులు వేసే విధంగా తన ఆలోచనలను మార్చుకుంది.

ఆ రూట్లో కూడా మంచి ఆదాయం

ఆ రూట్లో కూడా మంచి ఆదాయం

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సమంతకు చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే సమంత కేవలం సినిమాల ద్వారానే కాకుండా కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటోంది. నేషనల్ కంపెనీలకు చెందిన ప్రమోషనల్ యాడ్స్ లో కూడా సమంత మంచి ఆదాయాన్ని అందుకుంటోంది.

స్వీట్ పర్సన్ అంటూ

స్వీట్ పర్సన్ అంటూ

రీసెంట్ గా ఆమె పెళ్లి అయిన ఒక బాలీవుడ్ హీరోతో కలిసి ఒక ప్రత్యేకమైన యాడ్ లో కూడా నటించింది. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సమంత అతను చాలా స్వీట్ పర్సన్ అంటూ క్యాప్షన్ ఇవ్వడం విశేషం.

రణ్ వీర్ సింగ్ తో సెల్ఫీ

రణ్ వీర్ సింగ్ తో సెల్ఫీ

ఇక సమంత యాడ్ లో నటించిన ఆ హీరో మరెవరో కాదు. ప్రముఖ బాలీవుడ్ హీరో దీపికా పదుకొనె భర్త రన్వీర్ సింగ్. ఈ ఇద్దరూ కలిసి ఇటీవల ఒక కమర్షియల్ యాడ్ లో నటించారు. అందులో సమంత ఒక వైట్ యూనిఫామ్ లో కనిపిస్తోంది. ఇక వీరి కలయిక మంచి స్నేహంగా మారినట్లు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సమంత అతను చాలా స్వీట్ పర్సన్ సెల్ఫీ ఫోటోలు పోస్ట్ చేసింది ఇక ఈ ఫోటో లో ఇద్దరు కూడా నవ్వుతూ కనిపించారు.

లేడి ఓరియెంటెడ్ మూవీస్

లేడి ఓరియెంటెడ్ మూవీస్

సమంత సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఇప్పటికే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో చేసినటువంటి శాకుంతలం సినిమాతో పాటు యశోద అనే మరొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ తో ఆమె ఖుషి అనే సినిమా చేస్తోంది.

తమిళ్ హిందీలో..

తమిళ్ హిందీలో..

ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం విజయ్ లోకేష్ కనగరాజ్ కలయికలో రాబోయే మరో సినిమాలో కూడా సమంత నటించబోతున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అమెజాన్ ప్రైమ్ లో నిర్మించబోతున్న ఒక ప్రాజెక్టులో సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X