Samantha: బాడీ బిల్డర్ రేంజ్ లో మారిపోతున్న సమంత.. ఆ షేప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అంటే సినీ తారలు చాలా వరకు ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే గ్లామర్ విషయంలో కాస్త కూడా తేడా రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇక బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత కూడా ఆ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అని చెప్పాలి. ఇక రీసెంట్ గా ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదల చేయగా అది కాస్త వైరల్ అయింది. అందులో ఆమె ఫిట్నెస్ లో గట్టిగానే మార్పులు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

కమర్షియల్ సినిమాలకు దూరంగా..
క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత ఎన్నో సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు మాత్రం ఆమె కమర్షియల్ సినిమాలకు కాస్త దూరంగానే ఉంటుంది. ఎక్కువగా లేడీ రిలేటెడ్ సినిమాలు అలాగే మంచి ఫ్యాన్ ఇండియా సినిమాల కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటోంది. ఇక ఆమె ప్రతి సినిమాకు కూడా తన లుక్స్ విషయంలో అలాగే ఫిట్నెస్ విషయంలో కూడా మార్పులు చేస్తోంది.

బూస్ట్ ఇచ్చిన యశోద
ఇటీవల సమంత బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన యశోద సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా పెట్టిన పెట్టుబడికి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. కాస్త నిరాశలో ఉన్న సమంతకు ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. తదుపరి సినిమాలతో కూడా అలానే సక్సెస్ అందుకోవాలి అని ఆమె ప్రణాళికలు రచిస్తోంది.

అమెజాన్ వెబ్ సీరీస్ కోసం..
ఇక సమంత ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ రూపొందించబోయే సిటాడెల్ అనే ఒక వెబ్ సీరీస్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమాలో సమంత మంచి యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించబోతోంది. అందుకోసమే ఫిట్నెస్ విషయంలో కూడా ఆమె చాలా మార్పులు తీసుకురావడానికి సిద్ధమయ్యింది.

లేడి బాడీ బిల్డర్ తరహాలో
ఇప్పటికే సమంత గ్లామర్ విషయంలో మారడమే కాకుండా ఒక లేడీ బాడీ బిల్డర్ తరహాలో మారుతూ ఉండడం విశేషం. ఇక ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేసిన సమంత అందులో తన ఫిట్నెస్ లో ఎంత మార్పు వచ్చిందో చూపించింది. జిమ్ లో బ్యాక్ సైడ్ నుంచి వీడియోను షూట్ చేయగా అందులో ఆమె కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

యాక్షన్ కోసమే ఇలా..
సమంత ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ లో కనిపించాలి కాబట్టి కాస్త బలంగా ఉండాలి అని దర్శకులు సూచించడంతో ఆమె ఈ విధంగా తన శక్తికి మించి హార్డ్ వర్క్ అయితే చేస్తోంది. అంతేకాకుండా సమంత ఆ మధ్య ఒక వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే ఇక దాని నుంచి కూడా కోలుకోవడానికి ఆమె వ్యాయామాలు గట్టిగానే చేస్తుంది. ఇక సమంత నెక్స్ట్ శాకుంతలం సినిమా కూడా త్వరలోనే విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా గుణశేఖర్ దర్శకుడు. అలాగే విజయ్ దేవరకొండ ఖుషి ప్రాజెక్ట్ కూడా ఈ ఎడాది విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











