అవార్డ్స్ షోలో షాక్ ఇచ్చిన సమంత.. మొదటిసారి టాప్ అందాలను అలా హైలెట్ చేస్తూ..
గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత ఇటీవల కాలంలో అయితే అందాల ప్రదర్శనలో చాలా మంది హీరోయిన్స్ కు ఆమె గట్టిపోటీని ఇస్తుంది అనే చెప్పాలి. హాట్ కిల్లర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటోతో సమంత హాట్ టాపిక్ అయ్యేలా నిలుస్తోంది. ఆమె క్రేజ్ నార్త్ ఇండస్ట్రీలో కూడా మెల్లమెల్లగా పెరుగుతోంది అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఒక అవార్డ్స్ ఫంక్షన్ కు వెళ్లిన సమంత గతంలో ఎప్పుడూ లేని విధంగా టాప్ అందాలను హైలెట్ చేస్తూ చాలా అందంగా కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకసారి ఆ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్కేయండి..

మరింత స్పీడ్..
సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత తన కెరీర్ లో చాలా కొత్తగా స్టార్ట్ చేసింది అనే చెప్పాలి. అంతకు ముందు వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అనే తరహాలో సమంత తనకు నచ్చినట్లుగా ఉంటుంది. ఒక విధంగా ఇప్పుడే ఆమె మరింత స్పీడ్ పెంచినట్లు కూడా అర్థం అవుతోంది. కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ కంటెంట్ ఉండేలా సెలెక్ట్ చేసుకుంటుంది.

అప్పటి నుంచి..
అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అనంతరం సమంత వేస్తున్న అడుగులు చాలా కొత్తగా ఉన్నాయి అనే చెప్పాలి. అందులో చాలా బోల్డ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత పుష్పా సినిమాలో ఏకంగా ఐటెం సాంగ్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. గ్లామర్ విషయంలో సమంత మరింత డిఫరెంట్ గా హైలెట్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.

వయసు పెరుగుతున్న కొద్దీ..
ఇక సోషల్ మీడియాలో కూడా సమంత తరచుగా ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. వీలైనంతవరకూ సమంత చాలా పాజిటివ్ గా ముందుకు సాగుతోంది. ఇక పోస్ట్ చేస్తున్న ఫోటోలకు కూడా భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. సమంత వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా మారుతుంది అని కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు.

ఈవెంట్ లో హైలెట్ అయ్యేలా
ఇటీవల క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఈవెంట్‌లలో రెడ్ కార్పెట్‌పై నడిచిన సమంత హాట్ క్లివేజ్ తో గౌనులో దర్శనమిచ్చింది. ఊ అంటావా పాట ద్వారా ఇటీవల వెండితెరపై పెద్దఎత్తున క్రేజ్ అందుకున్న ఈ గ్లామర్ బ్యూటీ బోల్డ్ గ్లామర్ ట్రీట్ తో రోజురోజుకు మరింత షాక్ ఇస్తోంది. సమంత టాప్ అందాలతో మొత్తానికి ఈవెంట్ లో చాలా హైలెట్ అయినట్లు అర్ధమవుతోంది.

సినిమాలతో బిజీబిజీగా..
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అలాగే యశోద అనే మరో థ్రిల్లర్ సినిమాలో కూడా ఆమె డిఫరెంట్ పాత్రలో కనిపించబోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు సమంత త్వరలోనే అమెజాన్ ప్రైమ్ కోసం ఒక భారీ యాక్షన్ సినిమాలో నటించబోతోంది. ఇక మరిన్ని కథల పై కూడా చర్చలు జరుపుతున్న సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ అవ్వాలని గ్లామర్ డోస్ పెంచుతోంది.


Click it and Unblock the Notifications











