Samantha: నయా లుక్‌లో సమంత.. వైరలవుతున్న సామ్ పోస్ట్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'ఏం మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు వరుస విజయాలను అందుకుంది. కెరీర్ ప్రారంభంలోనే అగ్ర హీరోల సరసన లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది. అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, అభినయంలో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ దూరంగా ఉంటూ బాలీవుడ్ లో బిజీబిజీగా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడు సంబంధించి నయా లుక్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

'ఏం మాయ చేశావే' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు మొదటి మూవీనే సూపర్ హిట్ అందుకుంది. దీంతో దర్శక, నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టారు. దీంతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంది. స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది. ఈ సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్రహీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. దీంతో అనతి కాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియన్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.

Samantha Ruth Prabhu Stunning New Look viral in Social Media Fans React

నాగ చైతన్య తో విడాకులు, మయోసైటీస్ అనే వ్యాధి బారినపడింది. దీంతో ఏడాదికాలం సినిమాలకు దూరమైంది. ఈ వ్యాధికి చిక్సిత అనంతరం బాలీవుడ్ లో అడుగుపెట్టింది. వరుసగా సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. అలా సామ్ రాజ్, డికె దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్‌లో నటించింది. ఈ సిరీస్‌లో సామ్ తన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. తల్లి పాత్రలో భావోద్వేగ నటనను అందించింది. దానితో పాటు శృంగార సన్నివేశాలతో కూడా యువతను ఆకర్షించింది. త్వరలో 'ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌3' వెబ్ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.

ఇదెలా ఉంటే.. సోషల్ మీడియాలో కూడా సామ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫోటోలు, వీడియో షేర్ చేస్తూ.. తన ఫ్యాన్స్ పలుకరిస్తుంది. అలాగే.. తన రిల్ లైఫ్, రియల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకులతో పంచుకుంటుంది. అలా తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త లుక్ లో దర్శనిమిచ్చింది. సామ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో సమంత హాలీవుడ్ మోడల్ లాగా కనిపిస్తోంది. ఎన్నాడు చూడని విధంగా నయా లుక్ లో సామ్ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సామ్ నయా లుక్స్తో కుర్రాళ్లను కుదిపేస్తోంది. ఈ లేటెస్ట్ లుక్ మత్తెక్కేలా చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు పాత సామ్‌ను మిస్ అవుతున్నాం అంటూ కామెంట్స్ చేసున్నారు. సామ్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 'ఏ మాయ చేసావే జెస్సీగా'.. చూడాలని సామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే.. హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నందంటూ మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, సమంత ఒక ప్రముఖ మ్యాగజైన్ కోసం ఇలా ఫోటోలకు పోజులిచ్చినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: samantha samantha ruth prabhu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X