బ్రాతో రెచ్చిపోయిన సమంత: అదొక్కటి అడ్డు లేకుంటే ఇక అంతే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను అనుభవిస్తూ వరుస చిత్రాలతో హవాను చూపిస్తోంది ప్రముఖ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. 'ఏమాయ చేశావే' అనే మూవీతో పరిచయం అయిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను మాయ చేసేసింది. అంతేకాదు, అందరి దృష్టినీ ఆకర్షించి వరుసగా ప్రాజెక్టులను చేస్తూ వచ్చింది. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఇక, ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సామ్ బిజీ అయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ పిక్‌ను సమంత షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

స్టార్‌డమ్.. ప్రయోగాలకు సిద్ధం
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. వరుసగా సినిమాలను చేస్తూ వస్తోంది. మొదట్లో గ్లామర్ రోల్స్‌లో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మాత్రం పంథాను పూర్తిగా మార్చుకుంది. ఇందులో భాగంగానే పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు, స్పెషల్ సాంగ్స్, నేషనల్ లెవెల్ ప్రాజెక్టులు చేయడానికి సిద్ధం అవుతోంది.

ఫ్యామిలీ మ్యాన్‌తో యమ క్రేజ్
చాలా కాలంగా హీరోయిన్‌గా అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సందడి చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. గత ఏడాది 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర బాగా హైలైట్ అవడంతో నేషనల్ రేంజ్‌కు క్రేజ్‌ను పెంచుకుంది. ఫలితంగా ఆమెకు బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఇక్కడ నిరాశే.. ఆ మూవీ భారీగా
ఇటీవలే సమంత సమంత.. విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే తమిళ చిత్రంతో వచ్చింది. నయనతార, విజయ్ సేతుపతి కూడా నటించిన ఈ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇక, ప్రస్తుతం సామ్.. గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

భారీ ప్రాజెక్టుల్లో భాగమైన నటి
సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఆమె 'యశోద' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండతో 'ఖుషి' మూవీలోనూ చేస్తోంది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ఓ సినిమా కమిట్ అయిందని తెలుస్తోంది. ఇవి మాత్రమే కాదు.. BAFTA అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ డైరెక్షన్‌లో ఓ ఇంగ్లీష్ మూవీ చేయబోతుంది.

సోషల్ మీడియాలో సందడిగా
భాషలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన సమంత.. కెరీర్‌ను ఏమాత్రం బ్రేకులు లేకుండా ముందుకు సాగిస్తోంది. అయినప్పటికీ ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అందాలతో వల వేస్తోన్న సామ్
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ భామ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ లేపుతోంది. ఇలా సమంత తన ఫిగర్‌తో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతూనే ఉంటోంది.

హాట్ పిక్‌ను షేర్ చేసిన భామ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా ఓ హాట్ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బ్రా మాత్రమే ధరించి ఉంది. అంతేకాదు, ఎద అందాలను కనిపించకుండా ఓ వాలెట్‌ను అడ్డుగా పెట్టుకుంది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సమంత హాట్ ఫొటో విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











