Samantha: షాకింగ్.. తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇస్తున్న సమంత.. ఎందుకంటే?

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది స్టన్నింగ్ బ్యూటి సమంత. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది అనతికాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇక ఆ సినిమాలు హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఇక ఇటీవల యశోదతో మంచి హిట్ అందుకున్న సామ్ శాకుంతలం సినిమాతో డిజాస్టర్ చవిచూసింది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్సుతో బిజీగానే గడిపింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుందట. దీంతో సామ్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నట్లు తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద:టాలీవుడ్ అందమైన ముద్దుగుమ్మల్లో ఒకరైన సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా ఏదో ఒక చిత్రం చేస్తూ ఫుల్ బిజీగా మారింది. అయితే ఈ మధ్య ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేసింది. అందులో యశోద సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ తర్వాత వచ్చిన శాకుతంలం మాత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

Samantha Taking 1 Year Long Break From Movies And Not Signing Any Film

ఇంటర్నేషనల్ అవార్డ్స్:ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన శాకుంతలంపై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్దగా స్పందన రాలేదు. కానీ అనుకోని విధంగా శాకుంతలం సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం సినీ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.

పెద్ద షాక్:ప్రస్తుతం రెండు మూడు చిత్రాలతో సమంత ఫుల్ బిజీగా ఉంది. సామ్ చేతిలో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా, సిటాడెల్ ఇండియన్ వెర్షన్, చెన్నై స్టోరీ చిత్రాలు ఉన్నాయి. అయితే తాజాగా కీలక నిర్ణయం తీసుకుని అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చినట్లు ఓ న్యూస్ తెగ స్ప్రెడ్ అవుతోంది.

Samantha Taking 1 Year Long Break From Movies And Not Signing Any Film

ప్రీక్వెల్:మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సామ్ ఒప్పుకున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఈ షూటింగ్ మరో 3 రోజుల్లో పూర్తి కానుంది. అలాగే సిటాడెల్ గా ప్రీక్వెల్ గా వస్తున్న వెబ్ సిరీస్ చిత్రీకరణ కూడా దగ్గరపడిందట. సిటాడెల్ సిరీస్ కూడా త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనుందని సమాచారం.

Samantha Taking 1 Year Long Break From Movies And Not Signing Any Film

అడ్వాన్స్ కూడా:ఇలా రెండు చిత్రాలు పూర్తి కానుండగా సమంత లాంగ్ బ్రేక్ తీసుకోనుందని టాక్ వస్తోంది. అందుకే ఇప్పటికీ తెలుగు, బాలీవుడ్ ఏ సినిమాకు సైన్ చేయలేదట. అంతేకాకుండా ఇంతకుముందు తీసుకున్న చిత్రాల అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసిందని టాక్. ఇలా సినిమాలకు గ్యాప్ ఇచ్చి సంవత్సరం పాటు సామ్ సుధీర్ఘ విరామం తీసుకోనుందని వినికిడి.

Samantha Taking 1 Year Long Break From Movies And Not Signing Any Film

వచ్చే ఏడాది:సమంత ఈ సంవత్సరం పాటు తన ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అదనపు చికిత్స తీసుకుంటుందని సమాచారం. ఆరోగ్యం కోసం సినిమాలకు ఏడాది దూరంగా ఉండే సామ్ ఖుషి ప్రమోషన్స్ లో మాత్రం కనిపిస్తుందట. కాగా సమంత చేస్తున్న మరో మూవీ చెన్నై స్టోరీ యంగ్ హీరోయిన్ శ్రీలీలకు వెళ్లిందని ఓ న్యూస్ అయితే వచ్చింది. ఇదే నిజం అయింతే సామ్ చేతిలో ప్రస్తుతం ఏ సినిమా లేనట్లే. ఇక ఏడాది తర్వాతే సమంత సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X