Samantha Ruth Prabhu మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఆ ఇద్దరితో కలిసి మరోసారి వెబ్‌ సిరీస్‌లో!

దక్షిణాది సినీ పరిశ్రమలో సమంత రుత్ ప్రభు అగ్రతారగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన తడాఖాను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత పుష్పలో స్పెషల్ సాంగ్‌లో నటించి తన స్టార్‌డమ్‌ ఏంటో చూపించిన సమంత ఇప్పుడు మరోసారి ఫ్యామిలీ మ్యాన్ దర్శక ద్వయం రాజ్ డీకేతో కలిసి మరోసారి క్రేజీ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

పుష్ప సాంగ్‌తో ట్రాప్ ట్రెండింగ్‌గా

పుష్ప సాంగ్‌తో ట్రాప్ ట్రెండింగ్‌గా

పుష్ప సినిమాలో ఊ అంటావా? ఊఊ అంటావా పాటతో దేశవ్యాప్తంగా సమంత తన గ్లామర్ ట్రీట్‌తో మోత మోగించింది. ఈ పాటకు ఫ్యాన్స్, అభిమానులు బ్రహ్మరథం పట్టడంతో సమంత సోషల్ మీడియాలోని అన్ని ఫ్లాట్‌ఫాంలో ట్రెండింగ్‌గా నిలిచింది. పుష్పకు ముందు సమంత తీసుకొన్న నిర్ణయం సమంజసమే అనే వాదన ఇప్పుడు మీడియాలో బలంగా నిలుస్తున్నది.

సమంతకు 5 కోట్ల రెమ్యునరేషన్?

సమంతకు 5 కోట్ల రెమ్యునరేషన్?

అయితే పుష్ప సినిమాలోని స్పెషల్ పాట కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఊ అంటావా.. ఊఊ అంటావా పాట కోసం 5 కోట్లు తీసుకొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే సమంత రెమ్యునరేషన్ సడెన్‌గా వైరల్ కావడం వెనుక పీఆర్ స్ట్రాటెజీ ఏమైనా ఉందా అనే సందేహాలను సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో

పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌కు ముందు ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లోని టెర్రిరిస్టు పాత్రలో సమంత ఒదిగిపోయారు. రాజీ పాత్రలో ఆమె నటనకు దేశవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభించాయి. దాంతో సమంత‌కు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వచ్చాయనేది ముంబై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే తనకు వస్తున్న ఆఫర్లను ఆమె ఆచితూచీ స్పందిస్తున్నారని ఆమె పీఆర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ది ఫ్యామిలీ మ్యాన్ ప్రీక్వెల్‌లో సమంత

ది ఫ్యామిలీ మ్యాన్ ప్రీక్వెల్‌లో సమంత

అయితే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రూపొందించిన దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్దమవుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా రూపొందించనున్నారు. ఈ ప్రీక్వెల్ ముఖ్యంగా రాజీ పాత్ర చుట్టు అల్లిన కథతో రూపొందిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మీడియాకు అధికారికంగా వెల్లడించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

యశోద సినిమా షూటింగులో బిజీగా

యశోద సినిమా షూటింగులో బిజీగా

ఇదిలా ఉండగా, ప్రస్తుతం సమంత రుత్ ప్రభు టాలీవుడ్‌లో యశోద అనే సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రెగ్నెంట్ నర్సుగా సమంత ఓ ఎమోషనల్ పాత్రను పోషిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ చిత్రం దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్నది. ఈ సినిమాకు హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

సమంత సినిమా కెరీర్ ఇలా..

సమంత సినిమా కెరీర్ ఇలా..


సమంత రుత్ ప్రభు కెరీర్ విషయానికి వస్తే.. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో కాథూ వాకులా రెండు కాదల్ చిత్రం, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ శంతరుబన్ శేఖర్ రూపొందించే చిత్రంలో, ఫిలిప్ జాన్ రూపొందించే అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్ చిత్రంలో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X