రష్మిక, ఆలియా టాప్ లేపిన సమంత.. ఇండియాలో టాప్ 10 హీరోయిన్లు ఎవరో తెలుసా?

అగ్ర కథానాయిక సమంత ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సినిమాలు ఒక కారణమైతే, నాగచైతన్య - శోభిత ధూళిపాలలో పెళ్లి మరో రీజన్. వీరిద్దరి పెళ్లితో సమంత కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారా? ఆల్రెడీ లవ్‌లో ఉన్నారా? అంటూ రకరకాల ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలు పక్కనపెట్టి వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టిన సమంత మరోసారి వార్తల్లోకెక్కారు.

దాదాపు 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. సినిమాలు చేసినా చేయకున్నా స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ , క్రేజ్‌తో దూసుకెళ్తున్నారు సమంత. తనతో పాటు కెరీర్ ప్రారంభించిన వారంతా ఇప్పటికే పెళ్లి చేసుకుని ఫేడ్ అవుట్ అవ్వగా.. సామ్ ఇప్పటికీ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా దూసుకెళ్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి నటించిన ఏమాయ చేశావేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సమంత . ఆ వెంటనే ఎన్టీఆర్, మహేశ్ బాబు , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా సింహాసనాన్ని అధిష్టించారు.

Samantha Ruth Prabhu Top Heroine over Alia Bhatt and rashmika mandanna in Ormax Survey in Dec 2024

సమంత ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అన్న సెంటిమెంట్ బలపడి లక్కీ హ్యాండ్‌గా నిలిచింది. తెలుగులో వచ్చిన స్టార్‌డమ్‌తో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అజిత్, విజయ్, సూర్య, విశాల్, కార్తీ వంటి హీరోలతో నటించి సౌత్‌లో తిరుగులేని హీరోయిన్‌గా నిలిచింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలోనే టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్యని 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు సామ్.

అయితే నాలుగేళ్లు తిరిగేసరికి వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడంతో చిత్ర పరిశ్రమ, అభిమానులు షాకయ్యారు. చైతూతో విడిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లిన సామ్‌ పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టారు. తెలుగులో చివరిసారిగా ఖుషిలో కనిపించిన సమంత.. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన సిటాడెల్ హనీ బన్నీతో ఓటీటీలలో తన హవా మరోసారి చూపించారు. ఇటీవల అక్కినేని నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల వివాహం నేపథ్యంలో సమంత పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది.

తాజాగా సమంత ఓ అరుదైన ఘనతను అందుకున్నారు. డిసెంబర్ 2024 వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఎవరంటూ ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో సమంత అగ్రస్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు. ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలు చేయనప్పటికీ సమంత టాప్‌లో నిలవడం ఆమె క్రేజ్‌కు నిదర్శనం . సామ్ తర్వాత స్థానంలో అలియా భట్, దీపిక పదుకొనె, రష్మిక మందన్న, సాయిపల్లవి, త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, శ్రీలీల, శ్రద్ధా కపూర్ నిలిచారు. ప్రస్తుతం ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: ormax survey samantha alia bhatt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X